పోలవరం ప్రాజెక్ట్ పై బిజెపి, వైసీపీ కపట నాటకం 

Wednesday, January 22, 2025

ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా మొదటినుండి అడ్డుపడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుంటిసాకులతో నిధులు విడుదల చేయకుండా, అవసరమైన సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నది. తాజాగా, ప్రాజెక్ట్ లో నీటి నిల్వ ఎత్తుపై వారం రోజుల వ్యవధిలోనే భిన్నమైన సమాధానాలను పార్లమెంట్ సాక్షిగా ఇచ్చింది.

 రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కనకమేడల రవీంద్ర ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని స్పష్టం చేశారు.

అయితే  గ‌త వారం పార్ల‌మెంట్ లో వైసీపీ ఎంపీ సత్యవతి పోల‌వ‌రం ఎత్తుపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పారు.. ప్ర‌క‌ట‌న వ‌చ్చి నాలుగు రోజులు గ‌డ‌వ‌క ముందే పోలవరం పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది.

1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు. నీటి నిల్వ సామర్ధ్యం 41.15 కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. వారం రోజులలోనే కేంద్రం మాట మార్చడం గమనార్హం. ఇటీవల అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ దగ్గరే నీటి నిల్వ చేస్తామని ప్రకటించారు.

మరోవైపు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనబడడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు విషయాన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ పనులు ముందుకు సాగకుండా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రకరకాల కారణాలతో నత్తనడకన నడుస్తోంది.

 ఇంత వరకూ ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డిజైన్లు సిద్ధం కాలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఈసీఆర్‌ఎఫ్‌కు సంబంధించి డయా ఫ్రం వాల్‌ (ర్మాణం కూడా పూర్తి చేసింది. నది లోపలకు కాంక్రీట్‌ పంపించి, సుమారు 20 మీటర్ల నుంచి 30 మీటర్లు, దానికి పైగా కూడా నది లోపల ఈ డయా ఫ్రం వాల్‌ నిర్మించారు.

దీనిపైనే ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మించాల్సి ఉంది. ఇంతవరకు దీని జోలికి వెళ్లలేదు. చంద్రబాబు హయాంలోనే సుమారుగా పూర్తయిన స్పిల్‌వేకు గేట్లు పూర్తిగా పెట్టారు. స్పిల్‌వే కాంక్రీట్‌, రేడియల్‌ గేట్లు, రివర్‌ స్లూయిజ్‌ గేట్ల పని పూర్తయింది. అప్రోచ్‌ చానల్‌ పనులు మాత్రం ఇంకా 36.54 శాతం మిగిలి ఉంది.

గత టీడీపీ హయాంలో మొదట స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి, గ్రావెటీ ద్వారా కాలువలకు నీరివ్వాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత దిగువ కాఫర్‌ డ్యామ్‌ కూడా పూర్తి చేసి ప్రధాన డ్యామ్‌ ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మించాలనేది అప్పటి ఆలోచన. అప్పుడు ప్రతి సోమవారం పోలవరం అనే నినాదంతో అత్యంగా వేగంగా పనులు జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles