పొంగులేటి, జూపల్లిలను బీజేపీ అగ్రనేతలు టార్గెట్!

Sunday, December 22, 2024

ఎంతగా ప్రయత్నించినా బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్న బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీజేపీ అగ్రనేతలు టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బిజెపి చేపట్టిన ‘మహా సంపర్క్ అభియాన్’ లోభాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణాలో చేపట్టిన పర్యటనలను చూస్తుంటే ఆ విషయం స్పష్టం అవుతుంది. ఈ నెల 15న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఖమ్మంలో, 25న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగసభలలో పాల్గొంటారు. ఇక, 31న ప్రధాని మోదీ మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొనననున్నారు.

పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేర్చుకునేందుకు మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ప్రత్యక్షంగా ప్రయత్నం  చేస్తే, ఈ వ్యవహారాన్ని స్వయంగా అమిత్ షా పర్యవేక్షించారు. వారిద్దరూ చేరితో తెలంగాణాలో బీజేపీలో కొత్త జోష్ రాగలదని భావించారు. కానీ వారిద్దరూ చేరకపోవడంతో ఒకింత నిరాశచెందారు. అందుకనే, పట్టుబట్టి వారి నియోజకవర్గాలలో ఈ బహిరంగసభలు ఏర్పాటు చేశారు.

2024 ఎన్నికలలో బిజెపి దృష్టి సారిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాలలో దేశ వ్యాప్తంగా ఈ నెలరోజులలో బహిరంగసభలు జరుపుతున్నారు. అయితే, అమిత్ షా పర్యటించే ఖమ్మంలో బిజెపికి కనీసం బలం కూడా లేదు. కానీ, పొంగులేటి కేంద్రం అదే కావడం, అక్కడనే పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేస్తుండడంతో, అంతకు ముందే పట్టుబట్టి అమిత్ షా బహిరంగసభను బిజెపి ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది.

ఇక జెపి నడ్డా పాలగోనే నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు ప్రాంతంలో ఉంది. జూపల్లిని టార్గెట్ చేస్తూ ఈ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక ప్రధానిని తీసుకొస్తున్న మల్కాజిగిరికి ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుంది. వచ్చే ఎన్నికలలో  బిజెపి సహితం ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నది. ఒక కీలక నేత ఇక్కడి ఉంది పోటీ చేసే అవకాశం ఉంది.

ఈ ముగ్గురు కీలక నేతల పర్యటనలు గమనిస్తే బిజెపి ఇప్పుడు తెలంగాణాలో కేవలం కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నదని, ఆ పార్టీకి ఇక్కడ అధికారం దక్కనీయకుండా అడ్డుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ నేతలు బిఆర్ఎస్ ను ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి పెద్దల వ్యూహం తారుమారైనట్లు తెలుస్తోంది.

ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 21 వరకు ఒకొక్క రోజు ఒకొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం విజయాల గురించి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెడుతూ ఒకొక్క రోజు ఆయా రంగాలలో ప్రభుత్వ పరాజయాలను ప్రజలలోకి తీసుకు వెళ్లే విధంగా కేసీఆర్ పాలనపై రెవెర్స్ ప్రచారం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపిచ్చారు. అయితే పార్టీలో ఇప్పుడు ఆ హడావుడి కనిపించడం లేదు. కేంద్ర నాయకత్వం నిరుత్సాహ పరిచిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles