పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళసైకు కేసీఆర్ షాక్ 

Friday, May 3, 2024

రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా నెలల తరబడి వాటిని తన వద్దనే ఉంచుకొంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ వ్యవహరించడంతో చెలరేగిన రాజకీయ వైరుధ్యాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. 

అయితే సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకొని సూచించడంతో తన వద్ద వేటినీ పెండింగ్ లో ఉంచకుండా కొన్నింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.  మొత్తం 10 బిల్లులకు, మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో రెండు బిల్లులపై ప్రభుత్వం వివరణ అడడగా, మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును తిప్పిపంపారు. రెండు బిల్లులపై వివరణ కోరారు గవర్నర్. 

బిల్లులపై గవర్నర్ తీరుపై కేసీఆర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పెండింగ్ బిల్లులను ఇప్పుడు ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండానే అవి చట్టాలుగా రూపిందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కేసీఆర్- డా. తమిళసై మధ్య సాగుతున్న `ప్రచ్ఛన్న పోరు’ మరోసారి వెలుగులోకి వస్తున్నది.  గత వారమే రాష్త్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమంకు హాజరయ్యేందుకు రాజ్ భవన్  తొమ్మిది నెలల తర్వాత కేసీఆర్ వెళ్లారు.

అయితే, కేసీఆర్ ప్రభుత్వం ఆరోపిస్తున్నల్టు రాజకీయ కారణాలతో తాను బిల్లుల ఆమోదాన్ని నిలిపివేయలేదని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. ఎందుకు నిలిపి వేయాల్సి వచ్చిందో తాను వివరించానని, వాటిపై ప్రభుత్వం నుండే స్పందన లేదని ఆమె చెప్పుకొచ్చారు. బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులతో పాటు, ఆమె వద్ద పెండింగ్ లో ఉన్న రెండు బిల్లులను కూడా తిరిగి అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని రాష్త్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటే గవర్నర్ కార్యాలయం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో కొన్నింటిని ఆమోదించకుండా అలాగే అట్టిపెట్టుకోవడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. నిర్ణీత వ్యవధిలోగా బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. అటువంటి సమయంలో అసెంబ్లీ ముందు మరోసారి గవర్నర్ ఆమోదం పొందని బిల్లులను తీసుకు రావడం ద్వారా డా. తమిళసై వ్యవహారశైలిపై మరోసారి రాజకీయ పోరాటంకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles