పులివెందులలో `విక్టిమ్ కార్డు’ ప్రదర్శిస్తున్న అవినాష్ రెడ్డి

Saturday, January 18, 2025

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో, బహిరంగసభలకు బుధవారం సాయంత్రం వైఎస్ కుటుంభంకు కంచుకోటగా భావించే పులివెందులలో అనూహ్యమైన జనస్పందన లభించడంతో దిక్కుతోచని సీఎం వైఎస్ జగన్ బృందం `విక్టిమ్ కార్డు’ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడవుతుంది.

ఆ మరుసటి రోజే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా ముందు వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వివేకా కూతురు సునీత రెడ్డితో పాటు  కొందరు టీటీడీ నేతలు రెండేళ్లుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంపై కుట్రలు చేసి పార్టీకి ఆపాదించాలని చూస్తున్నారని విమర్శించారు.

పులివెందుల ప్రాంతాన్ని జగన్ రెడ్డి అన్నిరకాలుగా అభివృద్ది చేస్తుంటే చంద్రబాబు పులివెందులకు అన్ని నిధులు అవసరమా? అని అంటున్నారన్నాని చెప్పారు. పులివెందులకు ఆదిత్య బిర్లా, అడిదాస్ లాంటి ఇండస్ట్రీలను తీసుకొచ్చారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న వ్యక్తి పులివెందులకు ఏం చేశారని ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా జరిగిన చంద్రబాబు పర్యటనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలే అని చెప్పారు.  టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు  తన ప్రభుత్వం రూ.68 వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ ఖర్చు పెట్టింది రూ. 22 వేల కోట్లు మాత్రమే అని చంద్రబాబు చెప్పార

సీమకు తాను రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే….జగన్ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాడని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన అంకెలు తప్పయితే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా ఖండించే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారు. 

ఏది మాట్లాడిన ప్రజలు నమ్మేస్తారన్న ధోరణితోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారని అంటూ విరుచుకు పడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పులివెందుల ఎందుకు గెలవాలో ఈ మీటింగ్ ద్వారా వివరిస్తానని చంద్రబాబు చెప్పడంతో  పులివెందులపై టిడిపి ఫోకస్ పెడుతుందనే ఆందోళన ఏర్పడినట్లు స్పష్టం అవుతుంది.

`వై నాట్ కుప్పం’ అంటూ అక్కడ చంద్రబాబును ఓడిస్తామని మొన్నటి వరకూ ప్రగల్భాలు పలికిన వైసిపి నేతలు ఇప్పుడు పులివెందులలో ఆత్మరక్షణలో పడినట్లు అవినాష్ రెడ్డి `విక్టిమ్ కార్డు’ మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles