పులివెందులలో టిడిపి జెండా ఎగరడం తట్టుకోలేని వైసిపి!

Thursday, December 19, 2024

వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందులలో బహుశా నాలుగున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా టీడీపీ శ్రేణులు విజయయోత్సవాలు జరుపుకొడవడాన్ని వైసిపి నేతలు సహింపలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే పులివెందులతో పాటు ఆయన జిల్లా కూడా కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందులకు చెందినవారు కావడం గమనార్హం.

పులివెందులకు చెందిన ఒక వ్యక్తి, వైఎస్ కుటుంభంకు వ్యతిరేకంగా పోటీచేసి గెలుపొందడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కూడా. దానితో అతను గెలుపుకు దగ్గరలో ఉన్నారని తెలుసుకొని గత రాత్రి నుండే పులివెందులలో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాంగోపాల్ రెడ్డి ఇంట్లో అతని భార్య కేక్ కట్ చేసి సంబరాలలో పాల్గొన్నారు. 

ఈ సంబరాలను చూసి తట్టుకోలేకపోయారో లేదా మొత్తం మూడు పట్టభద్రుల ఎమ్యెల్సీ స్థానాలలో ఓటమి ఎదురైనదని ఆక్రోశం చెందారో ఏమోగానీ టిడిపి అభ్యర్థి గెలుపొందిన్నట్లు గత రాత్రి ప్రకటించిన అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫారం ఇవ్వడంలో మాత్రం తీవ్ర ఆలస్యం చేశారు.

దీంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. దాదాపు 3గంటల పాటు డిక్లరేషన్‌ ఫారం కోసం వేచిచూశారు. రీ కౌంటింగ్‌ కోరుతూ వైస్సార్సీపీ వర్గీయులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులు ఏదో చేస్తున్నారని టీడీపీ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది.

దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద రాత్రి 11.20 సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డితో కలిసి బైఠాయించారు. టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయేందుకు కారులో వచ్చారు.

 టీడీపీ శ్రేణులు అడ్డుగా వెళ్లడంతో ఆమె తిరిగి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఎన్నికల్లో గెలిచారని అధికారులు స్వయంగా ప్రకటించిన భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీసులు వ్యానులో పడేశారు. అనంతరం వీరిని అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికైన్నట్లు ప్రకటించి కూడా డిక్లరేషన్ ఫారం ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారులు చివాట్లు పెట్టడంతో చివరకు ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు.

ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. టపాసులు పేల్చి… స్వీట్స్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వైఖరిని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు.

‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?.. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?..ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు!. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియో‎ను జత చేసి చంద్రబాబు’’ ట్వీట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles