పిఎంఓలో కీలక వ్యక్తి నిర్మలమ్మ అల్లుడు!

Friday, November 22, 2024

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏకైక కుమార్తె వాంగ్మయికి  బెంగుళూరులోని ఉడిపి అడమారు మఠంలో బ్రాహ్మణ సంప్రదాయ పద్దతిలో అత్యంత నిరాడంబరంగా, సాదా సీదాగా వివాహం చేశారని ఈ రోజు పత్రికలన్నీ ప్రశంసిస్తున్నారు. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తి ప్రతీక్ దోషిని అల్లుడిగా చేసుకోవడం ద్వారా ఆమె ప్రస్తుతం ప్రభుత్వంలో తనకు తిరుగులేకుండా చేసుకోవడాన్ని మాత్రం ఈ సందర్భంగా చాలా మంది గమనించడం లేదు.

ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకపోయినా, తనకంటూ ఒక నియోజకవర్గం గాని, కనీసం ఒక రాష్ట్రం గాని లేకుండా నేడు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన ఆర్ధికశాఖను నిర్వహించడమే కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితురాలైన, నమ్మకస్తురాలైన మంత్రిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించడం బహుశా దేశంలో  అతి తక్కువ మందికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

గుజరాత్ కు చెందిన నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్ దోషి ప్రధాని మోదీ కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన అధికారుల్లో ఒకరిగా దోషి గుర్తింపు పొందారు. మోదీ”కళ్ళు , చెవులు” గా పరిగణిస్తారని అధికార వర్గాల్లో గుర్తింపు ఉంది.

 ప్రభుత్వంలోని అగ్రస్థాయి బ్యూరోక్రాట్‌లతోొ పాటు కీలక వ్యక్తులపై ఆయన ఒక విధంగా నిఘా పెడుతుంటారని ప్రతీతి. ప్రధాని మోదీతో జరిగే భేటీలు, అపాయింట్‌మెంట్‌ల ఖరారుతో పాటు కీలక అంశాలపై దోషీ ఫీడ్ బ్యాక్ ఇస్తారని తెలుస్తోంది. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పిఎంఓలో చేరారు. జూన్ 2019లో జాయింట్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు.

ప్రతీక్ దోషి సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. పిఎంఓ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, పిఎంఓ పరిశోధన,  వ్యూహ విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వాస్తవానికి నిర్మలా సీతారామన్ కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె మామగారు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి భర్త పరకాల ప్రభాకర్ రావడంతో ఆయన ద్వారా వాజపేయి ప్రభుత్వంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.

ఇక అక్కడి నుండి ఢిల్లీలో బిజెపి పెద్దలకు దగ్గరయ్యారు. ఆమె డ్రాఫ్టిక్ స్కిల్స్ చూసి ఆకర్షితులైన అరుణ్ జెట్లీ ఆమెను దగ్గరకు తీసి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం నుండి నేడు నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖ వరకు అన్ని ఆయన ప్రోద్భలంతో ఆమెకు వరించినవే.

అరుణ్ జెట్లీ గుజరాత్ కు ఇన్ ఛార్జ్ గా ఉండటం, ముఖ్యమంత్రి మోదీకి సన్నిహితుడు కావడంతో ఆమె కూడా జాతీయ స్థాయిలో అవసరమైన ప్రసంగాలు తయారు చేయడం ద్వారా ఆయనకు దగ్గరయింది. రాజ్యసభకు నామినేట్ కావడం, మోదీ ప్రధాని కాగానే నేరుగా వాణిజ్య మంత్రిగా నియామకం కావడం జరిగింది.

ఆ తర్వాత రక్షణ శాఖ వంటి కీలక శాఖను ఆమెకు అప్పచెప్పారు. అనారోగ్యంతో జైట్లీ 2019 ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో చేరకపోవడంతో, ఆయన నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను ఆమెకు అప్పచెప్పారు. రాజకీయంగా ప్రధాని మోదీకి అమిత్ షా కుడిభుజం వంటి వారైనా, నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన వ్యక్తి అయినా, నేరుగా ప్రధానితో ఏదైనా అంశం గురించి ప్రస్తావించగల చొరవ ఆమెకే ఉందని చెబుతూ ఉంటారు.

2014లో కేంద్ర మంత్రి అయినా సొంత రాష్ట్రం ఏపీలో నాడు తిరుగులేని నాయకుడిగా వెంకయ్యనాయుడు ఉండడంతో ఆమెను అక్కడ జోక్యం చేసుకోవద్దని, తమిళనాడు వ్యవహారాలు చూసుకోమని చెప్పారు.
ఇప్పుడు పార్టీ పరంగా ఆమెకు ఎటువంటి బాధ్యతలు లేవు. ప్రభుత్వంలో కూడా ఆమెకు చెప్పుకోదగిన బాధ్యతలు లేవు.

కానీ ప్రధానికి నమ్మకస్తురాలు కావడంతో పార్టీలో ఇతరులపై, అధికారులపై ఆధిపత్యం చెలాయించడం ఆమెకే సాటి అవుతుంది. సాధారణంగా ఆర్హ్తిక మంత్రికి అంతగా పెద్ద కాన్వాయ్ ఉండదు. కానీ ఢిల్లీలో ప్రధాని తర్వాత, బహుశా రక్షణ మంత్రి తర్వాత అతిపెద్ద కాన్వాయ్ ఆమెకే ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles