ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ఫై చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయి వైస్సార్సీపీ శ్రేణులు, వాలంటీర్లు నిరసనలు చేబడుతున్నారు. అందుకు ధీటుగా జనసేన శ్రేణులు సహితం పవన్‌పై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఖండిస్తూ నిరసనలకు దిగుతున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలకు, పోలీసులకు మధ్య పలుచోట్ల వాగ్వివాదాలు చోటుచేసుకొని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ ప్రశ్నించారు. ఎంఆర్ఓ తప్పు చేస్తే పై అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలని పవన్ ప్రహ్నిస్తుంటే జవాబు చెప్పలేని అధికార పక్షం నేతలు వీధులలో అలజడి సృష్టిస్తున్నారు.
ఇక వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారన్న పవన్ ఫిర్యాదు కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో అయితే, పెళ్లి మండపం వద్ద నుంచి జనసేన కార్యకర్తలు వెళ్లకపోడంతో కోపంతో రగిలిపోయిన సిఐ అంజు యాదవ్ ఓ జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించింది.
రెండు చేతులతో జనసేన కార్యకర్తలు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సిఐ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిమండం వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన శ్రేణులను అడ్డుకొనేందుకు సిఐ అంజు యాదవ్ చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు
సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపైనా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. నిరసన చేస్తున్న జనసేన నేత కొట్టే సాయిని చెంప దెబ్బలు కొట్టిన సీఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయం ముదరక ముందే వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్న సీఐను సస్పెండ్ చేసి విచారించాలని ఆయన కోరారు.
కాగా, వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ వివాదంపై మొదటిసారి స్పందిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్రోహమని విమరసంచారు. వాలంటీర్లతో చాలా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలు పరిశీలిస్తామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లు, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి చేసిన వాఖ్యాలను టీడీపీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్ధించారు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి వీలు కల్పించే వ్యవస్థాగత అంతరాలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
వాలంటీర్లపైనే అసభ్యత వ్యక్తం చేయడం తన ఉద్దేశం కాదని, కొందరు అధికార పార్టీ నాయకులు, ఇతర సంఘ వ్యతిరేక శక్తులు చేస్తున్న దుర్వినియోగాన్ని వెలుగులోకి తీసుకురావడమేనని ఆయన తెలిపారు. ఎటువంటి విచారణ చేపట్టకుండా మహిళా కమీషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసు ఎలా జారీ చేస్తారని గంటా ప్రశ్నించారు. పరిస్థితికి ప్రతిస్పందిస్తూ, పవన్ కళ్యాణ్ వాదనలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.