పరారీలో జగన్ గెలుపుకోసం శ్రమించిన ఉద్యోగసంఘ నేత!

Tuesday, November 5, 2024

లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పాలనా ప్రారంభించినా పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వంకు మించి ఉద్యోగులకు ఎన్నో సదుపాయాలు కల్పించిన గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిత్యం తీవ్రమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తూ, గత ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించేందుకు ప్రభుత్వం ఉద్యోగులను సమీకరించిన ఉద్యోగసంఘ నేత ఇప్పుడు పరారీలో ఉన్నారు.

ఉద్యోగులకు బకాయిలు చెల్లింపకుండా వేధిస్తున్నారని అంటూ కొద్దీ నెలలక్రితం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణపై పొలిసు కేసు నమోదు కావడంతో అరెస్ట్ తప్పించుకునేందుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  జిఎస్టీ వసూళ్లలో అక్రమాలు జరిగాయంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే నలుగురు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిగా ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్య నారాయణపై కేసు నమోదైంది.

వేతన బకాయిలతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొద్దినెలల క్రితం ఏపీజీఈఏ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పటి నుండి వారి పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది.  ఇంతలో జిఎస్టీ వసూళ్లలో వ్యాపారులన బెదిరించడం, వారితో కుమ్మక్కై ఖజానాకు గండికొట్టడం వంటి మోసాలు ఆడిట్‌లో బయటపడ్డాయి.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల‌లో ఉద్యోగ‌సంఘ నేత‌లు ఎన్ని డిమాండ్లు, ఎన్ని నిర‌స‌న‌లు చేశారో లెక్కే లేదు. వేదిక‌ల‌పై నుంచి సీఎం బాబు, నాటి స‌ర్కారుని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేవారు. ఏ నాడూ ఏ ఉద్యోగ‌సంఘ నేత‌ని క‌నీసం హెచ్చ‌రించిన పాపాన పోలేదు. ఫిట్మెంట్ తెలంగాణ కంటే ఎక్కువ‌గా ప్ర‌క‌టిస్తే, అప్ప‌టి టిడిపి స‌ర్కారుని అభినందించాల్సిన సూర్యనారాయణ ఎవ‌డి కోసం పెంచుతాడంటూ బ‌హిరంగ వేదిక నుంచే చంద్ర‌బాబుని తూల‌నాడుతూ మాట్లాడారు.

అయినా ఏనాడూ ఆయ‌న‌పై ఏ కేసులూ స‌ర్కారు పెట్ట‌లేదు. ఉద్యోగ‌ప‌రంగా, సంఘ‌ప‌రంగా ఇబ్బందులు పెట్టలేదు. లోటు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రంలోనూ ఉద్యోగుల‌కీ ఏ లోటూ రాకుండా చూసుకుంది టిడిపి ప్ర‌భుత్వం. అయినా స‌రే రెండుచేతుల‌తో ఓట్లు వేసి-వేయించి వైసీపీ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు ఉద్యోగులు. అయితే, ఇప్పుడు పాలిచ్చే ఆవుని కాద‌నుకుని త‌న్నే దున్న‌పోతుని తెచ్చుకున్న‌ట్ట‌య్యిందని ఆవేదన చెందుతున్నారు.

త‌మ‌కి ఇచ్చిన హామీలు, న్యాయంగా రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు మాదిరిగానే సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఈ సంఘాన్ని ప్ర‌భుత్వం ర‌ద్దుచేసింది. కోర్టుకెళ్లిన ఏపీజీఈఏ విజ‌యం సాధించింది. అయితే త‌న స‌ర్కారుకి జీ హూజూర్ అన‌కుండా పోరాటం అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ‌ని టార్గెట్ చేశారు.

వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ‌లో నిబంధ‌న‌ల‌కి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టార‌నే ఆరోప‌ణ‌ల కేసుని సూర్య‌నారాయ‌ణ చుట్టూ బిగించారు. ఆయన  కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో పెట్టిన కేస‌ని అంద‌రికీ తెలుసు.  పాపం, ఉద్యోగులు-ఉద్యోగ సంఘాల నేత‌లు చంద్ర‌బాబు మాదిరిగానే బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్లు సాధించుకోవ‌చ్చ‌నుకుని జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర తోక జాడించే ప్రయత్నం చేసే ఇబ్బందులకు గురవుతున్నారు.

సంఘం నాయకులపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఆరోపించారు. సూర్యనారాయణ శుక్రవారం నుంచి తమతో లేకపోయినా తమ సంఘం సభ్యుల ఇళ్లకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారని, దాంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles