పద్ధతిగా జరుగుతుందని ఓర్వలేకపోతున్న జగన్!

Thursday, January 9, 2025

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన డిమాండ్లతో కనీసం పట్టుమని పదిమందిని మెప్పించి తన వెంట తీసుకురాగల స్థితిలో ఉన్నారో లేదో ఆయనకు కూడా తెలియదు. ఏదైనా కొత్త లేదా మార్పు చేసిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాటిని విమర్శించడం, తప్పు పట్టడం తన జీవితాశయం అన్నట్లుగా ఆయన తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారే గాని వాస్తవిక దృక్పథంతో ఆ నిర్ణయాల్లోని మంచి చెడులను విశ్లేషించడం లేదు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించడం లేదు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ రూపంలో పేదల వైద్య అవసరాలకు అందించే ఆర్థిక సహాయాన్ని- బీమా కంపెనీల ద్వారా అందించడానికి ఒక వ్యవస్థీకృతమైన ఏర్పాటు చేస్తున్నది. దానిని జగన్ సహించలేకపోతున్నారు. ఏ పనైనా సరే పద్ధతిగా జరిగితే ఆయన ఓర్వలేరు. అరాచకంగా దోపిడీకి అనుకూలంగా ఉంటే తప్ప ఆయనకు నచ్చదు అన్నట్టుగా మాటల సరళి ఉంటున్నది.

బీమా కంపెనీల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు భరోసా ఇచ్చేలాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటూ ఉంటే.. మాటల గారడీ చేస్తూ  ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు అంటూ కారు కూతలు కూస్తున్నారు జగన్మో హన్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వారికి చేతికి ఇస్తే బిల్లులు చెల్లిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడికేదో తన ప్రభుత్వ కాలంలో ఏ రోజు ఆరోగ్యశ్రీ బిల్లులు ఆ రోజే క్లియర్ చేసినంత డాంబికంగా జగన్ మాట్లాడుతూ ఉండడం గమనించాలి. వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగులో పెట్టి కార్పొరేట్ ఆసుపత్రులు పేద పేషెంట్లను లోపలికి కూడా రానివ్వని పరిస్థితి కల్పించిన వ్యక్తి జగన్. అసలు ప్రభుత్వం ఇస్తుందా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలు భయంతో అనుమానంతో ఎదురుచూసే పరిస్థితి సృష్టించారు. అలాంటి దుస్థితి లేకుండా బీమా కంపెనీల ద్వారా జాప్యం లేని చెల్లింపులు జరిగేలాగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల్లో కూడా దాదాపు 90 శాతం మంది ఇన్సూరెన్సు కంపెనీల ద్వారా అందే మొత్తంతో చేయించుకునే వారే అయి ఉంటారు. ఇన్సూరెన్సు పేపర్లు స్పష్టంగా ఉంటే చాలు.. ముందుగా ఆ పేపర్లను పరిశీలించి.. ఎంత ఖరీదైన చికిత్స అయినా సరే క్యాష్ లెస్ గా అందించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు వస్తుంటాయి. ఆరోగ్య శ్రీ చికిత్సల విషయంలో పూర్తి భిన్నమైన వాతావరణం నడుస్తుంటుంది. ప్రభుత్వం చేసే చెల్లింపుల మీద ఆస్నత్రుల్లో నమ్మకం లేక.. ‘ఇక్కడ ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయబడవు’ అని జగన్ హయాంలో బోర్డులు పెట్టిన వారు కూడా ఉన్నారు. బీమా కంపెనీల మీద ఉన్న విశ్వాసం ప్రభుత్వం మీద లేకుండా చేశారు జగన్. ఇప్పుడు చంద్రబాబునాయుడు బీమా కంపెనీల ద్వారా.. ప్రజలకు ఆరోగ్య భద్రత, హాస్పిటల్స్ కు చెల్లింపులకు భరోసా కల్పించాలని చూస్తోంటే.,. జగన్ ఓర్వలేని ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

Previous article
Next article

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles