నోరుజారి వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రి కారుమూరి

Wednesday, December 18, 2024

రాష్ట్రవ్యాప్తంగా  అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర నష్ఠాలకు గురయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఆగ్రహంతో ఉన్న రైతులను సముదాయించేందుకు మంత్రులు వరుసగా గ్రామాలలో పర్యటిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పౌరసరఫరాల మంత్రి కారుమంచి నాగేశ్వరరావు ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేస్తుంటే అసహనంకు గురవుతున్నారు.  ఈ సందర్భంగా నోరుజారి రైతుల ఆగ్రహానికి గురవుతున్నారు.

ఇటీవల ఓ రైతును ఎర్ర పప్పా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కారుమూరి, తాజాగా మరోసారి నోరుజారి మరో రైతును నోరు మూసుకో అంటూ మండిపడ్డారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంటలో పర్యంటించిన ఆయన ఓ రైతులు తన సమస్యలు చెప్పుకుంటుంటే కాస్త అసహనానికి గురైన మంత్రి  ‘ఏయ్ నోరు మూసుకో’ అంటూ మండిపడ్డారు.

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కూడా మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఫొటోలు, వీడియోలు తీయొద్దని బలవంతం చేశారు. కెమెరాలు లాక్కోవడానికి ప్రయత్నించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోయి, మొలకలు వచ్చేసిన బాధలో రైతులు ఉన్నారని, వారిని ఆదుకుంటామన్న ధైర్యం మంత్రులు, ప్రభుత్వం కల్పించాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు. అంతేకానీ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని  కామెంట్స్ పెడుతున్నారు. 

అంతకు ముందు మంత్రి ఓ రైతును ఎర్రపప్పా అంటూ మాట్లాడడంపై పెద్ద దుమారం రేగింది. రైతులను ఆదుకోవాల్సిన మంత్రి ఇలా మాట్లాడడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై దిద్దుబాటు చర్యగా తాను ఉయోగించిన పదానికి వేరే అర్థం ఉందంటూ సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు.

గతవారం, తణుకు మండలం వేల్పూరులో మంత్రి పర్యటించి, అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ రైతు తన గోడును చెప్పుకుంటుండగ మంత్రి కారుమూరి రైతును ఉద్దేశించి “ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా” అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అకాల వర్షాలతో నష్టపోయిన రైతు విషయంలో మంత్రి ప్రవర్తించిన తీరుపై విమర్శలకు దారి తీసింది.

దాంతో సర్దిచెప్పుకొనే ధోరణిలో ఎర్రిపప్పా అంటే తిట్టు కాదన్న మంత్రి  దానికి బుజ్జి నాన్న అని అర్థం ఉందంటూ చెప్పుకొచ్చారు. తాను రైతులను దుర్బాషలాడలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్స్ నడుతున్నాయి. తమను కూడా అదే విధంగా అనొచ్చా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కారుమూరి బుజ్జి నాన్న అంటూ పోస్టులు పెడుతున్నారు.

తాను రైతులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బాగా తాగివచ్చి ఇబ్బంది కలిగించారని మంత్రి ఆరోపించారు. తన ధాన్యాం మొలకలు వచ్చిందని పదే పదే చెప్పడంతో అతడికి ఏ ధాన్యమైనా కొంటామని తాను సమాధానం చెప్పానని, మరి అగ్రిగోల్డ్‌ సంగతి ఏంటని అతడు ప్రశ్నించాడంతో అందుకే తాను ఎర్రిపప్పా అన్నానని.. ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న అనే అర్థంలో మాట్లాడానని వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles