నర్సంపేట బీజేపీలో భగ్గుమన్న వర్గపోరు

Saturday, January 18, 2025

తెలంగాణాలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయి వరకు బీజేపీలో రచ్చకెక్కిన కుమ్ములాటలు రాష్త్ర అధ్యక్షుడిని మార్చినంతటితో ఆగే సూచనలు కనిపించడం లేదు. బండి సంజయ్ హయాంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా నెట్టివేయబడిన `అసమ్మతి’ నేతలు ఇప్పుడు తాడోపేడో తేల్చుకునే విధంగా విధ్వంసంపై కూడా దిగుతున్నారు.

తెలంగాణలో బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి వరకూ రాష్ట్ర నేతలు కుమ్ములాడుకుంటే, ఇప్పుడు గల్లీ నేతలు దాడులకు దిగారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య వర్గపోరు మొదలైంది. తాజాగా, వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. 

బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.

వరంగల్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా  నర్సంపేట బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఓ వర్గం నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడికి దిగడం సంచలనంగా మారింది. తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు నేతలు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. మాజీ ఎమ్యెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ దాడి జరిగింది.

ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే నర్సంపేట బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యాలయంపై దాడి చేశాయి. ఈ ఘటన తర్వాత ఒక వర్గంపై మరో వర్గం నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

కాగా, దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం, కన్న తల్లి లాంటి పార్టీ కార్యాలయంపై మద్యం మత్తులో దాడి చేసిన గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, గడ్డం ఆంజనేయులు, చేపూరి నాగరాజు, తడుక అశోక్, పాలడుగు జీవన్ లను సస్పెండ్ చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ప్రకటించారు. బిజెపి పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని పార్టీ తీసుకునే చర్యలకు ఎవరు అతీతులు కారని స్పష్టం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles