నంద్యాలలో రణరంగంగా లోకేష్ యాత్ర..భూమా అరెస్ట్

Wednesday, January 22, 2025

టిడిపి ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజుల పాటు ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగింది. అయితే, 102వ రోజున నంద్యాలలో మాత్రం మంగళవారం రణరంగంగా మారింది. పార్టీలోని రెండు వర్గాలు ముష్టిఘాతాలు దిగాయి. నడిరోడ్డు మీద పరస్పరం దాడిచేసుకున్నారు. దానితో పోలీసులు జోక్యం చేసుకొని, వారిని చెల్లాచెదురు చేయాల్సి వచ్చింది.

దానితో భూమా అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్టు చేసి నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎవి సుబ్బారెడ్డిపై తన అనుచరులతో దాడి చేయించారని అఖిల ప్రియపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అఖిలప్రియతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ మంగళవారం అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలు యాత్రలో పాల్గొనే సందర్భంలో పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ విషయం చిలికి చిలికి గాలి వానల మారడంతో నారా లోకేష్ ఎదుటే భూమా, ఏవి అనుచరులు దాడికి దిగారు.  ఒకరిపై ఒకరి పిడుగులు గుద్దుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి పై అఖిలప్రియ అనుచరులు దాడికి దిగారు, ఆయన రోడ్డుపై పారేసి కాళ్లతో తన్నడం కనిపించింది.

ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు. ఏవీ సుబ్బారెడ్డిని చుట్టుముట్టి రక్తం కారేలా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. ఆయనను రోడ్డు మీదికి తోసిపడేశారు. ఈలోగా ఏవి అనుచరులు కూడా అఖిలప్రియ అనుచరులపై దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగమును మరిపించింది.

పరిస్థితిని గ్రహించిన పోలీసులు ఇరువర్గాలను చదర గొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటన అనంతరం పాదయాత్ర నుండి నేరుగా పట్టణ తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకొని ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఏవీ నోటీ నుంచి రక్తం కారడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది.

రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న సుబ్బారెడ్డి తనకే కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమాతో సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలని భావించిన తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేయడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది.

భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. భూమా బతికున్నంత వరకూ ఆయనకు కుడిభుజంగా అన్నీ తానై చూసుకున్న ఏవీ, ఆయన మరణాంతరం ఒక్కసారిగా విబేధాలొచ్చాయి. నాటి నుంచి తాను రాజకీయాల్లోకి రావాలని, నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని ఏవీ ఉవ్విళ్లూరుతున్నారు.

సుబ్బారెడ్డి ఆ విధంగా సొంతంగా పోటీ చేసే, తమకు పోటీ నాయకుడిగా ఎదగడాన్ని అఖిలప్రియ సహించలేక పోతున్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య ఎన్నోసార్లు ఘర్షణలు జరిగాయి. ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టారు.  అయ్యింద నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు వర్గాల వారు ఎక్కడ ఎదురుపడినా కొట్లాటలు, ఉద్రిక్తలు సహజం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles