దొంగ ఓట్లతో గెలిచానంటూ చిక్కుల్లో ఎమ్యెల్యే రాపాక

Friday, November 15, 2024

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామమైన చింతలమోరిలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని సంచలన ప్రకటన చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నది.
 జనసేన పార్టీ గుర్తు తో గెలిచి..ఆ తర్వాత వైస్సార్సీపీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రాపాక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని, ఉండి ఎమ్మెల్యే రామరాజు తనను సంప్రదించారని తాజాగా సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో చేశారు.

అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన వీడియో ఆయన శాసనససభ్యత్వానికే ఎసరు పెట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తన సొంత గ్రామానికి చెందిన వారే కాక పక్క తన సొంత గ్రామానికి చెందిన వారే కాక పక్క ఊర్ల నుంచి కూడా కొందరు వచ్చి తనకు దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఒక్కొక్కరూ పది దొంగ ఓట్లు వేయడం వల్లే తాను గెలిచేవాడినని పేర్కొంటూ అప్పటి నుంచి తన గెలుపుకు దొంగ ఓట్లే కారణమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇదే ఇప్పుడు రాపాకను ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు.

ఈ వాఖ్యలు వైరల్ కావడంతో జరిగిన పొరపాటు గుర్తించి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎరక్కిపోయి ఇరుక్కున్నారా? సొంత పార్టీ నేతలే ఇరికించారా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

టిడిపి తనకు రూ. పది కోట్లు ఆఫర్ చేసిందనే ఆయన వ్యాఖ్యలను వైసిపి సోషల్ మీడియా వైరల్ చేయడంతో అదే సమయంలో దొంగ ఓట్లతో తాను గెలిచాను అని చెప్పిన వీడియోను టిడిపి వారు వైరల్ చేయడంతో ఎరక్కపోయి ఇరుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఈసీకి ఫిర్యాదు చేయాలని జనసేన, వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.. రాపాక చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై  ఈసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

నాలుగు ఎమ్యెల్సీ స్థానాలలో ఓటమి ఎదుర్కోవడంతో పాటు సొంత ఎమ్యెల్యేలే నలుగురు టిడిపి అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ వేయడంతో సొంత పార్టీ ఎమ్యెల్యేలలో అసంతృప్తులు ఒకొక్కటిగా బైటపడుతూ ఉండటం సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడవేస్తున్నది. జనం ఇంకా తనవైపు ఉన్నారని చెప్పుకోవడానికి ఎక్కడో ఒక చోట ఉప ఎన్నిక వచ్చేటట్లు చేసి పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతం పంపాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.

క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా వారిని అనర్హులుగా ప్రకటించడం అంత సులభం కాదని తెలుసు. ఎప్పుడో రాజీనామా చేసినా ఇంకా స్పీకర్ ఆమోదించని గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించినా, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉపఎన్నిక జరిగితే గెలుపొందుతామనే నమ్మకం లేదు. పైగా గంటా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలో గెలుస్తూ వస్తున్నారు.

అందుకనే రాపాకను ఎన్నికల కమీషన్ శాసనసభ్యుడిగా అనర్హునిగా ప్రకటిస్తే అక్కడ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ఈసీ కానీ. లేదా న్యాయస్థానాలు కానీ దీనిపై చర్యలు తీసుకోవాలి అంటే ఆ వీడియ ఒరిజినల్ అని తేలాలి.

అయితే సాధారణంగా ఇలాంటి విషయాల్లో అధికార పార్టీ నేతలు అయితే అది ఒరిజినల్ వీడియో కాదని, విపక్షాల కుట్ర అని రుజువులు సంపాదించే ప్రయత్నం చేస్తాయి. పోలీసు అధికారులు తమ చేతుల్లోనే ఉంటారు కాబట్టి అలా రుజువు చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అయితే అధికార పార్టీ నిజంగా ఉప ఎన్నిక కావాలని కోరుకుంటే, రాపాకది ఒరిజినల్ వీడియో అని తేలిస్తే సరిపోతుంది. కచ్చితంగా రాపక పై అనర్హత వేటు తప్పుదు. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles