దేశంలోనే సంపన్న నేతలు చంద్రబాబు, జగన్!

Sunday, December 22, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అన్ని కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం వారికి లభిస్తున్న అంతులేని రాజకీయ అండదండలే అని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నేతలు దేశంలోనే ప్రజాప్రతినిధులతో సంపన్నులుగా ఉన్న మొదటి పది మందిలో ఉండటం అంతులేని అవినీతికి రహదారిగా ఏపీ మారడాన్ని వెల్లడి చేస్తుంది.

ఏపీలో పేదరికమే లేకుండా చేస్తా అంటూ నిత్యం చెప్పే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దేశంలోని ఎమ్యెల్యేలలో సంపన్నులుగా ఉన్నవారిలో నాలుగవ వారు కాగా, `ఇది క్లాస్ వార్’ అంటూ పేదలకోసం తాను పాటుపడుతుంటే ధనస్వాములు తనపై దాడి మొసలికన్నీరు కార్చే ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ జాబితాలో నాల్గవ స్థానంలో ఉండటం గమనార్హం.

శంలో ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అధ్యయనం చేసింది. తాజాగా ఎన్నికల సంఘానికి  ఎమ్యెల్యేలు  సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాల ఆధారంగానే ఈ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేకి రూ.1,400 కోట్ల ఆస్తులు ఉంటే, అత్యంత పేద ఎమ్మెల్యేకి రూ.2000 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.

దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నిర్మల్‌కుమార్‌ ధారా అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు. మరొ ఇద్దరు కర్ణాటక ఎమ్యెల్యేలే రెండు, మూడు స్థానాలలో ఉన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.668 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ రూ.510 కోట్లతో 7వ స్థానంలో ఉన్నారు. పైగా, వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు సహితం దేశంలో సంపన్న వనరులున్న పార్టీలలో ఉండటం గమనార్హం. ఇవ్వన్నీ అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తులు మాత్రమే. వారు ప్రకటించని ఆస్తులు అంతకు పలు రేట్లు ఉండే అవకాశం ఉంది.

వీరిద్దరూ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన వారిలో సహితం అత్యధికులు సంపన్నులే ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, కాంట్రాక్టు పనులు చేసేవారు, పుష్కలంగా నల్లడబ్బు ఉన్నవారు, విద్యా వ్యాపారం చేసేవారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

చంద్రబాబు నాయుడు గాని, జగన్ మోహన్ రెడ్డి గాని చట్టసభలకు ఎన్నిక కాకముందు సంపన్నులు కారు. జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండే పలు రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ వాటికి సంబంధించిన కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుటుంభ వ్యాపార సంస్థలు సహితం ఆయన అధికారంలో ఉన్నప్పుడే విశేషంగా లాభాలు గడిస్తూ రావడం గమనార్హం.

నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద పెద్ద కాంట్రాక్టులను సహితం ఆశ్రయిస్తులకు చిన్నవిగా విభజించి నామినేషన్లపై ఇవ్వడం లేదా టెండర్ పై ఇచ్చినా తక్కువ మొత్తానికి కేటాయించి, ఆ తర్వాత ఆ టెండర్ మొత్తాన్ని పలు రేట్లు పెంచడం ద్వారా వీరు ప్రధానంగా ఆదాయాలు సమకూర్చుకొంటున్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు మొబిలైజెషన్ అడ్వాన్సులు సహితం అందుకు తోడవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles