తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికై కుమ్ములాటలు షురూ!

Saturday, January 18, 2025

కాంగ్రెస్ పార్టీ అంటేనే మారేపార్టీలో లేనంతటి కుమ్ములాటలు ఉంటాయి. “మా పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ” అంటూ ఆ పార్టీ నాయకులే ఆ కుమ్ములాటలు సమర్థించు కొంటుంటారు.  ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకు బహిరంగంగానే వ్యతిరేకంగా పనిచేసినా, పార్టీ రాజకీయ ప్రత్యర్థులతో భుజం రాసుకొని తిరిగినా, చివరకు పార్టీ అగ్రనేత రాజీవ్ గాంధీ తమ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రకు వచ్చిన్నప్పుడు దూరంగా ఉన్నా – కాంగ్రెస్ నాయకులకే చెల్లుబాటవుతుంది.

తెలంగాణాలో ఈ కుమ్ములాటలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అస్త్రంగా ప్రయోగించి ఆ పార్టీని బలహీనం చేస్తూ గత తొమ్మిదేళ్లుగా రాజకీయంగా తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కాంగ్రెస్ లో సహితం జోష్ మొదలైంది. ఎక్కడ అధికారంలోకి వస్తామో అనుకొంటూ కుస్తీలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరడానికి సిద్దమైన వారు కూడా ఇప్పుడు వెనుకడుగు వస్తున్నారు.

అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ సహితం పార్టీలో రచ్చ మొదలైంది. మొదటగా పార్టీలో నిత్యం `అసమ్మతివాది’ గా పేరొందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటగా స్వరం వినిపించారు. తనకు సీఎం పదవి అవసరం లేదంటునే , ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్ దళిత అభ్యర్థిని సీఎం చేయాలంటూ కొద్దిరోజుల క్రితం ఆయనే అగ్గిరాజేశారు.

తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం  బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ దగ్గర ఆయన అనుచరులు పుట్టిన రోజు వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 20 వేల మందికి అన్నదానం చేశారు. ఇక అంతకు ముందు దాదాపు 500 కార్ల భారీ కాన్వాయ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి రిజర్వాయర్‌కు చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు.

గతంలో టిపిసిసి అధ్యక్షపదవి కోసం పోటీపడి, ఆ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో రేవంత్ ఉన్నంతవరకు కాంగ్రెస్ ఆఫీస్ మెట్లెక్కానని శపధం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. తమ్ముడు రాజగోపాలరెడ్డి ఎమ్యెల్యేగా రాజీనామా చేసి, మునుగోడు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేయగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి, తమ్ముడి గెలుపుకోసం చేయవలసింది అంతా చేశారు. అయినా పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం మినహా ఎటువంటి చర్య తీసుకోలేదు.  ఇప్పుడేమో పార్టీలో గ్రూపులు లేవని, అంత ఒక్కటే అని అంటున్నారు.

ఇక టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి ఎట్లాగూ ముఖ్యమంత్రి పదవిపైనే ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగితే ఆ పదవి తనదే అనే ధీమాలో ఉన్నారు.  ఇక సామాజిక సమీకరణాల దృష్ట్యా దళిత అభ్యర్థిగా ఆ పదవి తనదే అన్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనదైన రీతిలో పావులు కదుపుతున్నారు.  ఇక పలువురు బిసి నేతలు, మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి వంటి వార్లతో పాటు కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నేత కె జానారెడ్డి సహితం ఈ పదవి కోసం ఎప్పటి నుండో కాచుకొని ఉన్నారు.

కర్ణాటక ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి కోసం బహిరంగంగా ఎవ్వరూ వాదోపవాదాలకు దిగకుంగా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కట్టడి చేయగలగడం ఆ పార్టీ విజయానికి దారితీసిన కారణాలలో ఒకటి. ఆ విధంగా తెలంగాణాలో చేయగలరా? చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles