తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Sunday, December 22, 2024

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరికి అప్పచెప్పినా నిత్య అసంతృప్తులుగా కోమటిరెడ్డి సోదరులు  ఉంటూ వచ్చారు. పిసిసి నాయకత్వం తమకు అప్పచెప్పితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాం అంటూ చెబుతూ వచ్చారు. రాష్త్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఒక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటిస్తే పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు.

ఇక, టిడిపి నుండి వచ్చిన  రేవంత్ రెడ్డికి పిసిసి నాయకత్వం అప్పచెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు తాను గాంధీ భవన్ మెట్లెక్కానని శపధం చేశారు. ఢిల్లీలో ఎంపీలుగా ఇద్దరూ ఒకే చోట నివాసం ఉంటున్నప్పటికీ రాజకీయంగా `బద్ద శత్రువులు’గా మెలుగుతూ వచ్చారు.

గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సహాయనిరాకరణ కావించినా రేవంత్ రెడ్డిపై దండెత్తిన్నట్లుగా వ్యవహరించలేదు.  కాంగ్రెస్ లో తమకు భవిష్యత్ లేదని తెలుసుకొని 2009 ఎన్నికల ముందే బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేశారు. చివరకు గత ఏడాది తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరడంతో వెంకటరెడ్డి కూడా త్వరలో చేరుతారనే ప్రచారం జరిగింది.

అయితే ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి చెందడం, పార్టీలో ఆశించిన విధంగా ప్రాధాన్యత లభించక పోవడం, కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ ఉండడంతో అకస్మాత్తుగా వెంకటరెడ్డి వ్యవహారంలో మార్పు కనిపిస్తుంది. రెండు, మూడు నెలలకు ముందే రేవంత్ రెడ్డి వచ్చి నల్గొండలో సభ ఎట్లా పెడతాడో చూస్తా అంటూ హెచ్చరించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో తానే కేంద్ర బిందువుగా మారిపోవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కోమటిరెడ్డితో సంప్రదింపులు జరుగుతున్న. గత నెల కాంగ్రెస్ లో చేరమని మర్యాదపూర్వకంగా ఆహ్వానించేందుకు పంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెడుతూ కోమటిరెడ్డికి కూడా రేవంత్ తీసుకెళ్లారు. కాంగ్రెస్ లో చేరనున్న పలువురు నేతలతో బుధవారం సాయంత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లేముందు కోమటిరెడ్డి ఇంతో రాష్త్ర కాంగ్రెస్ ముఖ్యులు అందరూ భేటీ జరిపారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలతో భేటీ అయినా తర్వాతనే కోమటిరెడ్డిలో ఈ మార్పు వచ్చిన్నట్లు చెబుతున్నారు. ముందు తెలంగాణాలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఆ తర్వాత పదవులకోసం కొట్లాడుకోవచ్చనే ధోరణిలో ఉన్నట్లు చెబుతున్నారు. 2004కు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు అందరూ కలిసి బస్సు యాత్ర జరపాలని ప్రతిపాదించారు. ఆ విధంగా అందరం కలిసి ఉన్నామనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 కోమటిరెడ్డి ఇంతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్తో పాటు రాష్త్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తోపాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. యుద్ధానికి ఇక వంద రోజులే ఉందని.. ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలని ఈ భేటీ అనంతరం మీడియాతో కోమటిరెడ్డి చెప్పారు. న్న చిన్న సమస్యలు ఉన్నా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. త్వరలో బస్ యాత్ర ఉంటుందని.. దీనిపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఉచిత విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి అమెరికాలో ఏదో అంటే, కాంగ్రెస్ అధికారమలోకి వస్తే ఉచిత విద్యుత్ రద్దు చేస్తారంటూ బిఆర్ఎస్ నేతలు గగ్గోలు చేశారు. రాష్త్ర వ్యాప్తంగా రేవంత్, కాంగ్రెస్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అసలేమీ జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలు గందరగోళంకు గురయ్యారు. 

ఆ సమయంలో కోమటిరెడ్డి ఒక విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి, అక్కడున్న లాగ్ బుక్ లో ఉచిత విద్యుత్ ఎన్ని గంటలకు ఇస్తున్నారో వెల్లడి చేసి, 24 గంటలు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. అప్పటి నుండి కాంగ్రెస్ నేతలు ఈ అంశం లేవనెత్తడం మానుకున్నారు. ఆ విధంగా రేవంత్ ను ఆ వివాదం నుండి బైటపడేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles