తిరిగి టిడిపి గూటికి వైసిపి ఎంపి మాగుంట‌, ఎమ్మెల్యే ఆనం?

Sunday, December 22, 2024

అధిష్టాన పెద్దల వ్యవహార శైలిపై సీనియర్‌ నేతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకొంటున్న ఫలితంగా బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలు  వైసీపీని వీడదానికి సిద్ధపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అటువంటి వారు తిరిగి టిడిపిలో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనంతో తమ పార్టీకి సంబంధం లేన్నట్లు వైసిపి నాయకత్వం వ్యవహరిస్తున్నది. అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నెల్లూరు రురల్ ఎమ్యెల్యే  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విషయంలో మాత్రం అటువంటి ప్రయత్నం చేయకపోవడం పట్ల ఆనం తీవ్ర అవమానభారంతో ఉన్నట్లు తెలుస్తున్నది.

పైగా, తాను ఎమ్యెల్యేగా ఉండగానే తన నియోజకవర్గానికి మరొకరిని ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఇక రాజకీయ భవిష్యత్ తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకట్రెండు రోజుల్లో ఆనం నెల్లూరులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. వరుసగా మూడు రోజుల పాటు నెల్లూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన తమ అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి పార్టీ మారే విషయంపై అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా మాగుంట సహితం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించే సందర్భంలోనూ మాగుంట ముఖం చాటేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో తనకు తగిన ప్రాధాన్యతను కల్పించకపోవడం, సొంత పార్టీ నేతలు సైతం స్థానిక ఎంపీగా తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడం, తదితర కారణాలు వెరసి ఆయన వైసీపీపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా నేతల మధ్య మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అందులో భాగంగానే ఆనం తరహాలోనే ఇటీవల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తనపై నిఘా పెట్టారని, తన సెల్‌ఫోన్‌ ట్రాప్‌ చేశారని ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులు నిఘా పెట్టడం ఏమిటం టూ విస్తుపోతున్నారు. వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో ఉన్న విభేదాలను బహిర్గతం చేస్తుంది.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది అధికారుల తీరును కూడా పలు సమావేశాల్లో ఎండగట్టారు.

ఈ నేపధ్యంలోనే ఇటీవల సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆనంకు చిరంజీవి నుంచి కూడా పిలుపొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలోకి వస్తే రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను అప్పగిస్తామని, ఆ దిశగా చిరు నుంచి ఆనంకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు సీనియర్‌ నేతలు కూడా ఆనం బాటలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ళ్తేలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles