తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమం

Friday, November 22, 2024

గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

జనవరి 28న అర్ధరాత్రి 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను అంబులెన్స్‌లో నారాయణ హృదయాలయకు తరలించారు. ఆయనకు గుండెలో బ్లా క్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎక్మో ద్వారా  కృతిమంగా శ్వాస అందిస్తున్నామని, బెలూన్ యాంజియో ప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

 తారకతర్న అరుదైన ‘మెలెనా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని అన్నారు. బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. మెలైనా వ్యాధి కారణంగా తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు.

నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శనివారం సాయంత్రానికి హాస్పిటల్‌కు చేరుకొని వైద్యులను సంప్రదించారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తారకతర్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, కోలుకోవడానికి ఇంకా టైమ్ పడుతుందని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు
మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి దంపతులు కూడా చేరుకున్నారు.  సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారని ఆమె తెలిపారు. ఆయన సోదరులు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్ ఆదివారం ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles