తాడ్రిపత్రిలో ఉద్రిక్తత … జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు

Monday, December 23, 2024

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపి మాజీ ఎమ్యెల్యే, ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య నిత్యం వివాదాలు రాజుకోవడం, సవాల్- ప్రతిసవాల్ లతో ఆ ప్రాంతం ఉద్రిక్తలకు నిలయంగా మారింది.  తాజాగా, చీనీ తోటకు పంట భీమా డబ్బులను ఎమ్మెల్యే కేతిరెడ్డి కొట్టాశారని జేసీ ఆరోపించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 

ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వస్తానంటూ జేసీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్స కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫామ్ హౌజ్ కు వెళ్లేందుకు పిలుపునిచ్చిన జెసి ప్రభాకర్ రెడ్డిన శనివారం ఉదయం పోలీసులు గృహ నిర్భందం చేశారు. 

ఎలాంటి ఉధృిక్తతలు చోటుచేసుకోకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. రూ.13.89లక్షలు క్రాప్ ఇన్సూరెన్స్ కెతిరెడ్డి కొట్టేశారని జెసి ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కెతిరెడ్డి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, రైతుల మాదిరిగానే తనకు పంట బీమా వచ్చిందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ. 13.89 లక్షల పరిహారం అందిందని జేసీ ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏడాదిన్నర చీనీ తోటకు పంట భీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పంటల భీమాలో రైతులకు న్యాయం జరగలేదని, వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందని అంటూ ధ్వజమెత్తారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు. 

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని, దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు. చీనీ తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనీ చెట్లకు పంట నష్టం భీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ‘‘ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే… నేను పోతా…. థూ నీ బతుకు చెడ’’ అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులుకక్కారు.

జేసీ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ పంట బీమా వచ్చిందని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని… కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టు చూడు అంటూ సవాల్ విసిరారు. ‘‘నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. ఈ పదవి లేకపోతే జేసీని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పుతా” అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles