తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్యలో ఎమ్మెల్యే!

Tuesday, November 5, 2024

రాజకీయ కక్షలకు, ముఠా తగాదాలకు, తరచూ రాజకీయ ఘర్షణలకు పేరొందిన తాడిపత్రి పట్టణంలో తాజాగా సీఐ ఆనందరావు ఆత్మహత్య రాజకీయ దుమారం రేపుతోంది. అది ఆత్మహత్య కాదని, హత్యా అని పేర్కొంటూ స్థానిక వైసిపి ఎమ్యెల్యే పెద్దిరెడ్డిపై టిడిపి నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో మరోసారి రాజకీయ రణక్షేత్రంగా మారే అవకాశం కనిపిస్తుంది.

వైసిపి ఎంఎల్‌ఎ పెద్దారెడ్డి ఒత్తిడితోనే తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఆనందరావు చనిపోయాడని స్పష్టం చేశారు. పైగా, వచ్చే ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఐ ఆనందరావు ఆత్మహత్యపై విచారణ జరుపుతామని వెల్లడించారు.

సీఐ ఆనందరావు కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని పేర్కొంటూ దానిని పోలీసులు బయట పెట్టాలని స్పష్టం చేశారు. తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యలో అనేక రహస్యాలు ఉన్నాయనిఆరోపిస్తూ తనపై తప్పుడు కేసు పెట్టేందుకు ఉన్న చట్టం, సీఐ ఆనందరావుకు ఎందుకు న్యాయం చేయటం లేదని మాజీ ఎమ్యెల్యే నిలదీశారు. బలవంతంగా సీఐ పిల్లతో స్టేట్మెంట్ ఇప్పించారని మండిపడ్డారు. 

“నా బస్సుల బోల్టులకు, టైర్లకు కేసులు పెట్టిన పోలీసులు, ఇప్పుడు ఎక్కడున్నారు” అంటూ  ప్రశ్నించారు. ముమ్మాటికి సీఐ ఆత్మహత్య రాజకీయ ఒత్తిడే తోనే జరిగిందని తేల్చి చెప్పారు. సిఐపై పెద్దారెడ్డి అనేక ఒత్తిళ్లు తెచ్చారని, పెద్దారెడ్డి ఒత్తిళ్లు బయటపడకుండా ఫోన్ కాల్ డేటా డిలీట్ చేశారని ఆరోపించారు. 

తాడిపత్రి సిఐ ఆనందరావు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడి కారణంగానే సిఐ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నారు. కాగా, డీఎస్పీ కార్యాలయానికి సీఐ ఆనందరావు 12.33 నిమిషాలకు వెళ్తే 12.44 నిమిషాలకు వైసీపీ నేత ఫయాజ్ భాషా వెళ్లాడని, డీఎస్పీ కార్యాలయం వద్ద గందరగోళం జరిగిందని ప్రభాకరరెడ్డి తెలిపారు.

ఆనందరావును చాలా కష్టాలు పెట్టారని అంటూ ఒక సిఐ రాజకీయ వత్తిడులతో ఆత్మహత్యకు పాల్పడితే పోలీస్ అసోసియేషన్ ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు. “గతంలో మా అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని ఇష్యూ చేశారు. ఇప్పుడు ఒక సీఐ చనిపోతే అసోషియేషన్ ఎందుకు స్పందించడం లేదు? సీఐ కుటుంబ సభ్యులను ప్రభుత్వం నుంచి సహాయ, సహకారులు అందవని బెదిరిస్తారా?” అంటూ నిలదీశారు. 

తన నాన్న తాడిపత్రిలో పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నానని సీఐ కుమార్తె చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఓ కేసులో వైసీపీ నాయకుడు ఫయాజ్ భాష పేరు తొలగించాలని సీఐపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.  తెల్లవారుజామున 4:10 కి ఏమి పని ఉందని ఆత్మహత్య చేసుకున్న సీఐ ఇంటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారు?  అని ప్రశ్నించారు. సీఐ సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే ఉరివేశాడేమోనని అనుమానం వస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles