తనను అరెస్ట్ చేస్తే జగన్ పతనం .. పవన్ హెచ్చరిక

Tuesday, November 19, 2024

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంలో తాను అరెస్ట్ కు సిద్ధం అంటూ పవన్ ప్రకటించారు. కానీ ఆ  విధంగా చేయడం జగన్ ప్రభుత్వం పతనంకు దారితీస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.

గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నట్లుగా ప్రభుత్వం అభిప్రాయపడుతోందని పేర్కొంటూ కోర్టుకు వెళ్లేందుకు వీలుగా గురువారం  జివోను విడుద‌ల చేసింది.  జ‌న‌సేనాని ప‌వ‌న్ వాలంటీర్ల‌పై దురుద్దేశ్యపూర్వకంగానే చేశారవ్యాఖ్యలు చేశారని స్పష్టం చేసింది. 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పరువుకు నష్టం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అంటోంది. అంతేకాదు, వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని చెబుతోంది. వారిని అవమానించేలా, విషపూరిత వ్యాఖ్యలు చేశారని చెబుతోన్న ప్రభుత్వం, ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఆ వెంటనే పవన్ తీవ్రంగా స్పందించిన పవన్”నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జీవో ఇచ్చారు.. నీ ప్రభుత్వాన్ని కిందకు దించేది ఈ జీవోనే. మైనింగ్‌ అక్రమాల సంగతి కూడా చూస్తాం. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతాను. ఎక్కడికి వచ్చి అయినా నన్ను విచారించుకోవచ్చు” అని హెచ్చరించారు.

 ”వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒక సారి మాట చెబితే అన్ని రిస్క్‌లు తీసుకునే చెబుతా. నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా ఉన్నా. మీరు ప్రాసిక్యూషన్‌ అంటే నేను సిద్ధంగానే ఉన్నా” అంటూ సవాల్ చేశారు. 

అయితే, ఈ ఒక్క సంఘటనే నీ ప్రభుత్వం పతనానికి రంగం సిద్దమైందని సీఎం వైఎస్ జగన్ గ్రహించాలని స్పష్టం చేశారు. ఏపీ బాగుండాలంటే జగన్ పోవాలని పేర్కొంటూ జగన్‌ను ఇంటికి పంపడమే తమ ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పారు.  వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ అన్నీ మింగేస్తాడని అప్పుడే చెప్పానని గుర్తు చేస్తూ ఇప్పుడు విశాఖలో రిషికొండను మింగేశారని ఆరోపించారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, గొడవలు జరుగుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయి” అంటూ వాలంటీర్లపై చేసిన వాఖ్యాలను సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. ఒక్కో వాలంటీరుకు ఇచ్చే రోజు వేతనం రూ. 164 అంటూ ఇది డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లని విమర్శించారు.

పైగా, వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని చెబుతూ  23 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారు? అని రాష్త్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది డేటా చౌర్యం కిందకు వస్తుందని స్పష్టం చేశారు.  సమాచారం సర్వర్‌లో పెట్టుకున్నా నేరమే అని తెలిపారు.  

వ్యక్తిగత సమాచారం భద్రపరచుకోవడం చాలా ముఖ్యం అంటూ సమాచార సేకరణపై ప్రభుత్వ విధి విధానాలు ఏమిటి? అని నిలదీశారు. వాలంటీర్లు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని చెబుతూ సేకరించిన సమాచారం ఏటా ఒక కంపెనీకి ఇస్తున్నారని ఆరోపించారు. సమాచార చౌర్యంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles