టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డిపై సిట్ చర్యలు!

Wednesday, January 22, 2025

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి తాను చేసిన ఆరోపణలపై జారీచేసిన నోటీసుకు స్పందిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందజేశారు. ఆయన అందజేసిన ఆధారాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి వాస్తవాలాను నిగ్గు తేల్చవలసింది పోయి `నిరాధార ఆరోపణలు’ చేశారని రేవంత్ రెడ్డి పైననే చర్యలు తీసుకొనేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.

రేవంత్ రెడ్డి తాను చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ బృందం పేర్కొంటూ న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతం ఇచ్చారు. తద్వారా మరెవ్వరు ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేయకుండా కట్టడిచేసే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒకే  మండలంలో 100 మంది పాస్ అయినట్టుగా రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపణలు  చేశారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.  గురువారం విచారణకు హాజరైన రేవంత్ తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు సమర్పించగా ఆయన స్టేట్ మెంట్ ను  సిట్ రికార్డు చేసింది. జగిత్యాల జిల్లా మాల్యాలకి చెందిన నిందితుడు రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ పీఏ తిరుపతికి సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అదే జిల్లాల్లో ఎలాంటి మెరిట్ స్టూడెంట్స్ కాకున్నా 100 మందికి 100 మార్కులు వచ్చాయని రేవంత్ పేర్కొన్నారు.

తమకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం వలనే వచ్చేది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, లక్షలాది మంది నిరుద్యోగులు, యువకులను దృష్టిలో పెట్టుకొని అధికారుల నోటీసులకు స్పందించి, తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు.

ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు దీనిపై స్పందించారని,  తనతో పాటు బండి సంజయ్, కేటీఆర్ స్పందించారని రేవంత్ గుర్తు చేశారు. తాము ముగ్గురం కూడా తమకున్న సమాచారాన్ని బయట పెట్టామని చెప్పారు. అయితే తనకు, బీజేపీ అధ్యక్షుడుకి నోటీసులు ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇద్దరు వ్యక్తులే నేరం చేసినట్లు కేటీఆర్ క్లియరెన్స్ ఇచ్చారణ విస్మయం వ్యక్తం చేశారు.

ఈ కుట్రలో బండి సంజయ్, ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉందని సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు తెలిపినట్లు చెప్పారు. అలాగే కేటీఆర్‌ వద్ద కూడా పూర్తి సమాచారం ఉందనిఎం ఆయనను కూడా విచారించాలని డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీకి పాత కంప్యూటర్లు మార్చి కొత్త కంప్యూటర్లను కేటీఆర్ అందజేశారని, వాటి పర్యవేక్షణ బాధ్యతను రాజశేఖర్ రెడ్డికి అప్పగించారని తెలిపారు. బండి సంజయ్ పాత్ర, బీజేపీ పాత్ర, టీఎస్‌పీఎస్సీలో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ పాత్రపై పూస గుచ్చినట్లు కేటీఆర్ తెలిపారని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని విచారణ అధికారిని అడిగానని, అయితే ఇంకా తమ దృష్టికి రాలేదని ఏఆర్ శ్రీనివాస్ చెప్పారని పేర్కొన్నారు. దీంతో‘‘నేను కేటీఆర్‌పై ఫిర్యాదు చేశాను, కానీ తీసుకోలేదు. నా ఫిర్యాదు కాపీపై ఇన్ఫర్మేషన్‌ అని రాసుకున్నారు. నాకు నోటీసులు ఇచ్చి పోలీసులు వేధించారు అని ఏఆర్ శ్రీనివాస్‌కు చెప్పాను’రేవంత్ వివరించారు.

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ విషయంలో సిటి కాదని సిబిఐతో విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి అక్రమాల పుట్టగా మారింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని దుయ్యబట్టారు. తప్పును ఎత్తి చూపడమే నేరంగా పరిగణిస్తున్నారని, వెనక్కి తగ్గే సమస్యే లేదని స్పష్టం చేశారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్డి విచారణ కోసం కొట్లాడుతమని, 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రేవంత్ వెల్లడించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles