జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెనుక ఐపాక్, వైసీపీ!

Wednesday, January 22, 2025

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిమానంతో పెడుతున్నారని టీడీపీ వర్గాలు కూడా భావించాయి. అందుకనే వాటిపై మౌనంగా ఉంటూ వస్తున్నాయి.

గతంలో కొద్దికాలం పాటు టిడిపిలో ఉత్సాహంగా కనిపించిన ఎన్టీఆర్ పలు కారణాల చేత గత దశాబ్దంకు పైగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నడూ రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ప్రదర్శించడం లేదు. పైగా టాలీవుడ్ లో అగ్రశ్రేణి నటుడిగా ఉంటూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకోవడంతో సినిమాలో తీరిక లేకుండా గడుపుతున్నారు.

అయితే, నందమూరి కుటుంభంలో చంద్రబాబుకు వ్యతిరేకత నెలకొందని ప్రచారం చేయడం కోసం ఇటువంటి ఫ్లెక్సీ లను వైసిపి శ్రేణులే అక్కడక్కడా పెడుతున్నట్లు ఇప్పుడు వెల్లడైంది. పైగా, ప్రస్తుతం వైసిపి ఎన్నికల వ్యూహాలు పర్యవేక్షిస్తున్న ఐపాక్ బృందం సూచనలతో వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైంది. కేవలం టిడిపి శ్రేణులలో గందరగోళం సృష్టించడం కోసంగా బైటపడింది.

తాజాగా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రవేశించినప్పుడు వైసిపి శ్రేణుల విద్రోహ చర్యలను టిడిపి నేతలు పసిగట్టారు. ఒంగోలు ప్రధాన కూడలిలో “నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’” అంటూ ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడం కలకలం రేపాయి. 

ఓ పక్క ఒంగోలు లో నారా లోకేష్ యువగళం యాత్ర కొనసాగుతుండగా ఈ ప్లెక్సీ లు ఎవరు ఏర్పటు చేసారా? అని టీడీపీ వర్గీయులు ఆరా తీస్తుండగా ఈ ప్లెక్సీ లు ఏర్పటు చేసింది మా పార్టీ వారే అంటూ వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. తమ పార్టీ నేతలే ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీలు వేశారని పేర్కొంటూ తమ పార్టీ వారికి ఏ పని సరిగా చేయడం రాదంటూ ఎద్దేవా చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే అందులో హరికృష్ణ ఫోటో ఉండేదని అంటూ లోకేష్ మీటింగ్ ప్రకాశంలో ఉంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వైసీపీ వాళ్లే పెట్టారని స్పష్టం చేశారు. వాటిల్లో టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఫోటోలు చిన్నవిగా అండగా, నిలువెత్తు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్నాయి. 

సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, ఫ్లై ఓవర్ కింద, చర్చ్ సెంటర్, కనిగిరి ఇలా పట్టణంలో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

ప్రస్తుతం కొండేపి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలే ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఉంటాయని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. లోకేశ్ పాదయాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకే కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  పార్టీలో విభేదాల సృష్టించి వాటితో లబ్దిపొందాలని వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒంగోలులో ఓ టిడిపి కార్యకర్త ఈ ప్లెక్సీలను తయారు చేయించి పెట్టించినట్లు టిడిపి వర్గాలు కనుగొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles