జనం దృష్టి మళ్లించడం కోసమేనా తెరపైకి సిల్క్ కుంభకోణం!

Wednesday, January 22, 2025

ఒక వైపు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పక్షం ఘోరపరాజయంకు గురికావడంతో టీడీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉండడం, మరోవంక వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడని ఆందోళనకు గురవుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా సిల్క్ డెవలప్మెంట్ లో భారీ అవినీతి జరిగిన్నట్లు ఆరోపణలను తెరపైకి తెచ్చారు.

ఇప్పటి వరకు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిన్నట్లు నిర్దుష్టంగా ఎటువంటి అభియోగాలకు ఆధారాలు లభించక పోయినా స్వయంగా సీఎం జగన్ రాష్ట్ర శాసనసభలో రెండు గంటలసేపు దీని గురించి ప్రస్తావిస్తూ దేశంలోనే అతిపెద్ద అవినీతిగా అభివర్ణించారు. అవినీతిలో చంద్రబాబు నాయుడు స్కిల్స్ దీనిలో బయటపడ్డాయని అంటూ ఆరోపణలు చేశారు.

సీఎం జగన్ మాటల ప్రకారమే దీని వల్లన ప్రభుత్వం రూ. 371 కోట్ల మేరకు నష్టపోయింది. కానీ స్వయంగా వేలకోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమే కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులలో అరెస్ట్ అయి, 16 నెలలో జైలులో ఉంది, బెయిల్ పై బయటవుంటూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న జగన్ కు ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణంగా కనబడిందా?

ఏదోరకంగా గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు నోటికి వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని స్పష్టం అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అసలు అవినీతి అన్నది జరగకపోయినప్పటికీ, ఏదో జరిగిపోయినట్లు మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 371 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి, 3 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు సీమెన్స్ అనే బహుళ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లెక్కన ప్రతి విద్యార్థి పై రూ 9, 000లను మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

అమ్మబడి, విద్యా దీవెన, తలలో దువ్వెన వంటి పథకాల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు కంటే, గత ప్రభుత్వం చేసింది చాలా సాధారణమైన ఖర్చు. నైపుణ్య శిక్షణ తరగతుల ద్వారా రాష్ట్రంలోని మూడు లక్షల 80 వేల మంది విద్యార్థులు శిక్షణ పొంది, సర్టిఫికెట్లను అందుకున్నారు. అవేమీ దొంగ సర్టిఫికెట్లు కాదు, తమకు తాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లుగా చెప్పుకునే సర్టిఫికెట్లు కాదు.

గత ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వమే సర్టిఫికెట్లను జారీ చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించింది లేదు.  మూడేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు 400 మంది నిపుణులను సీమెన్స్ సమకూర్చింది. జగన్ ప్రభుత్వం ఏమైనా వారికి జీతం ఇచ్చిందా?

కేవలం ఏపీ మాత్రమే కాకుండా ఆ సమయంలో ఏపీతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలు సీమెన్స్ తో ఒప్పందాలు కుదుర్చుకొని ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.  గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ లలో కూడా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించగా, అక్కడక్కడా ఎవ్వరు ఇటువంటి ఆరోపణలు చేయడం లేదు.

అయితే, ఎక్విప్మెంట్ సరఫరా చేసిన సబ్ కాంట్రాక్టర్ జీఎస్టీ సరిగ్గా చెల్లించలేదని అతనిపై కేంద్ర సంస్థలు దాడులు జరిపితే, గత ప్రభుత్వమేదో తప్పు చేసిందన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక కాంట్రాక్టు పనిని అప్పగిస్తే, ఆ సంస్థ సరిగ్గా జీఎస్టీ చెల్లించకపోతే ఆ కంపెనీ పై ఒకవేళ జీఎస్టీ, ఈడీ శాఖలు దాడులు నిర్వహిస్తే మేఘా కంపెనీ తో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనట్టేనా?

పైగా, శిక్షణ నిమిత్తం అవసరమైన పరికరాల కొనుగోలు కోసం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే మిషన్ అండ్ టూల్స్ సంస్థ తో సంప్రదింపులు జరిపిన తరువాతే , దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ప్రేమ్ చంద్రా రెడ్డి అనే నిజాయితీ కలిగిన అధికారి విడుదల చేశారు. ఆ అధికారి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 నైపుణ్య శిక్షణ తరగతుల కార్యక్రమంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రేమ్ చంద్రారెడ్డి అనే అధికారిని ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు. కానీ, ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేని కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ అనే అధికారిని మాత్రం పిలిచి వేధించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles