జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్న `ప్రజావేదిక’ కూల్చివేత!

Wednesday, December 18, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పరిపాలన సాగించిన `ప్రజావేదిక’ను అక్రమకట్టడంగా పేర్కొంటూ కూల్చివేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపుగా కూల్చివేశారనే విమర్శలు చెలరేగాయి. కూల్చివేతను సవాల్ చేస్తూ అప్పట్లో టిడిపి హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు వెంటనే ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా, ఇంకా ఆ కేసు పెండింగ్ లో ఉంది.

ఈ కూల్చివేత ఉదంతాన్ని ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అయితే ఇదే ఇప్పుడు స్వయంగా హైకోర్టు ప్రస్తావించడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పైగా, ఈ వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతను హైకోర్టులో సమర్ధించుకోలేక, తమ తప్పిదాన్ని ఒప్పుకోలేక తికమక పడుతున్నది. అప్పటి పరిస్థితులను బట్టి ఆ విధంగా చేయవలసి వచ్చిందంటూ ప్రభుత్వ న్యాయవాది అటు, ఇటు కాకుండా చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం కృష్ణపరివాహక ప్రాంతంలో అంతకన్నా ఎక్కువగా లోపలకు ఉన్న చంద్రబాబు నివాస భవనాన్ని గాని, ఇతర ప్రముఖుల భవనాలను గాని ముట్టుకొనక పోవడంతో కేవలం రాజకీయ కారణాలతోనే కూల్చివేసిన్నట్లు స్పష్టం అవుతుంది.

ఏపీలోని పలు పాఠశాలల్లో ప్రభుత్వం సచివాలయాల్ని, రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేయడాన్నిని సవాల్ చేస్తూ హైకోర్టులో  పిటిషన్లు దాఖలు కావడంతో  హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా  రూ.40 కోట్లు వెచ్చించి నిర్మాణాలు యథేచ్ఛగా పూర్తి చేసేశారు. దానితో పలువురు  అధికారులు ఇప్పుడు

ఈ సందర్భంగా హైకోర్టు ప్రజావేదిక కూల్చివేతను ప్రస్తావించడం గమనార్హం. ఈ కోర్టు ధిక్కరణపై విచారణ జరుగుతున్న సమయంలో వాటిని ఎందుకు అక్రమ కట్టడాలుగా పరిణించరాదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ ను ప్రశ్నించింది. ఆయన అవి అక్రమ కట్టడాలేనని అంగీకరిస్తూ, అవి అక్రమ కట్టడాలైనా ప్రజాధనంతో నిర్మించినవి కాబట్టి ఇతర అవసరాలకు వాడుకుంటామని తెలిపారు.

వాటిని విద్యాశాఖకు ఇచ్చేస్తామని చెప్పడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజా వేదిక వ్యవహారాన్ని ప్రస్తావించింది. గతంలో ప్రజా వేదికను అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్కూళ్లలో అక్రమ కట్టడాల్ని మాత్రం ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు అమికస్ క్యూరీకి ప్రభుత్వ అఫిడవిట్ ను ఇచ్చింది. దానితో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles