జగన్ దృష్టిలో కృష్ణా, గుంటూరోళ్లు ద్రోహులా!

Sunday, December 22, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధానిగా అమరావతి ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం, అక్కడినుండి దానిని మార్చే విధంగా అడుగులు వేస్తుండటం వెనుక ఆయనకు ఈ ప్రాంత ప్రజల పట్ల బలమైన సెంటిమెంట్ ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేసినా ఇక్కడి ప్రజలు తమను లెక్కచేయరని, అదే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఏమాత్రం చేసినా వారు గుర్తు పెట్టుకొని ఓటు బ్యాంకు గా మారుతారని బలమైన అభిప్రాయమే కారణమని చెబుతున్నారు.  

పైగా, కృష్ణా, గుంటూరు జిల్లా వారంత న‌మ్మ‌క‌ద్రోహులు ఎవ‌రూ ఉండ‌ర‌ని సాక్షాత్తు ముఖ్య‌మంత్రి పేర్కొన్నారంటూ ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన సందర్భంగా ఈ రెండు జిల్లాల‌కు చెందిన వైసిపిఎమ్మెల్యేలు ఆయనను కలిసి ఇదేమిటని నిలదీసే ప్రయత్నం చేశారట.

“అన్నా మేము తీవ్రంగా అన్యాయం అయిపోతాం..ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలి?” అంటూ రాజధాని విషయమై ఆయనను అడిగారట.  దీనికి స‌మాధానం ఇవ్వ‌కుండ జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను ఎదురు ప్ర‌శ్న వేశారు. అమ‌రావ‌తి ప్ర‌తిపాదించి ఎవ‌రు? అని అడిగారు. దీనికి ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు అని స‌మాధానం చెప్పారు. అభివృద్ధి చేసింది ఎవ‌రు? అంటే అదీ చంద్ర‌బాబేన‌న్నార‌ట‌.

మ‌రి కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు ఇంత మేలు చేసిన చంద్ర‌బాబుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇచ్చిన సీట్లెన్ని? మ‌న‌కు వ‌చ్చిన సీట్లెన్ని అని మ‌ళ్లీ జ‌గ‌నే రెట్టించి అడిగారు. దీంతో ఎమ్మెల్యేలంతా బిక్క‌మొఖాలు వేశారు. జ‌గ‌న్ ఉద్దేశం ఏంటంటే!

రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర వెన‌క‌బ‌డిన ప్రాంతాలైన‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా రాష్ర్టం న‌డిమ‌ధ్య‌లో రాజ‌ధాని ఉండాల‌ని గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను ఎంపిక చేశారు. అదే విధంగా అభివృద్ధి అంతా ఇక్క‌డే చేయాల‌ని ప్లానులు వేశారు. కొంత చేశారు. రూ.10 ల‌క్ష‌ల విలువైన భూమి కోటి రూపాయలకు అమ్ముకున్న‌వాళ్లూ ఉన్నారు.

రూ. 3 కోట్ల‌కు అమ్మేసి వ్యాపారాలు చేస్తున్న‌వారూ ఉన్నారు. అద్దెలు పెంచుకుని కొంద‌రు, రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో వ‌చ్చిన అవ‌కాశాలు అందిపుచ్చుకుని బాగుప‌డిన వారు ఈ రెండు జిల్లాల‌లో చాలా మందే ఉన్నారు. ఇంత చేసిన చంద్ర‌బాబుకు రెండు జిల్లాల్లోని 31 సీట్ల‌లో ఎన్నింట్లో గెలిపించారో తెలుసా?

కేవ‌లం 4 సీట్ల‌లో మాత్ర‌మే అని జగన్ గుర్తు చేశారు. “నేను పార్టీ పెట్టిన నుంచి కుల‌ప‌రంగా, అమ‌రావ‌తి ఇష్టంలేక ఈ ప్రాంతానికి మేలు కంటే కీడే ఎక్కువ చేశాను. అది తెలిసి కూడా ఈ రెండు జిల్లాల్లో నాకు వ‌చ్చిన సీట్లు 27”.

అంటే చంద్ర‌బాబు ఎంత మంచి చేసినా ఆయ‌న‌ని ముంచేసింది ఈ రెండు జిల్లాల‌ వాళ్లే క‌దా! ఇప్పుడు చంద్ర‌బాబు స‌గంలో వ‌దిలేసిన అభివృద్ధి ప‌నుల్ని మ‌నం పూర్తి చేస్తే పేరు చంద్ర‌బాబుకు వ‌స్తుంది. చంద్ర‌బాబులాగే మ‌న‌కూ వీళ్లు న‌మ్మ‌క‌ద్రోహం చేస్తే అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ‌లో దెబ్బ‌తిని అధికారానికి వ‌చ్చేసారి దూర‌మైపోతాం.

అందుకని న‌మ్మ‌క‌ద్రోహానికి మారుపేరైన ఈ రెండు జిల్లాల‌ను మ‌న సీట్ల లెక్క‌ల్లోంచి తీసేద్దాం. మీరంతా ఓడిపోతార‌నే అనుకుందాం. మీ ఎన్నిక‌ల ఖ‌ర్చు మొత్తం నేనే పెడ‌తాను. స్వార్థానికి మ‌రో పేరైన ఈ రెండు జిల్లాల ఓట‌ర్లు మ‌న‌మిచ్చే నోట్ల‌కు ఓట్లేస్తారు. మీరు గెలుస్తారు.

ఒక‌వేళ ఓడిపోయార‌నుకోండి. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల నుంచి వ‌చ్చిన సీట్ల‌తో అధికారంలోకి మ‌ళ్లీ వ‌స్తాను.  మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తానంటూ చెప్పి పంపించేశారు. అందుకే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న  వ‌స్తుంద‌ని ముందే తెలిసిన ఈ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ముందుగానే మానసికంగా సిద్ధమైనట్టు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles