తానేదే మేధావిని అన్నట్లు, పదవుల కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధి తన లక్ష్యం అన్నట్లు, ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహరిస్తుంటారు. ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యం అని, ఎవ్వరు అవినీతికి పాల్పడినా సహించను అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే, తాజాగా తాను కొన్నాళ్లపాటు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయనని ప్రకటించడం ద్వారా తన అసలు రంగును బట్టబయలు చేసుకున్నారు. ఏపీ విభజన చట్టం, అంతకు ముందు మార్గదర్శి వ్యవహారాలపై తనకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లలో తన మీడియా ద్వారా కోరగానే జగన్ ప్రభుత్వం స్పందించి, ఆ కేసులలో ఇంప్లీడ్ పిటీషన్ లు వేయడంతో జగన్ పై విమర్శలు కట్టిబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, వాస్తవానికి ఆయన ఏనాడూ మొదట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరింపలేదు. కేవలం వారికోసమే ఇటువంటి పిటీషన్లు వేశారు. అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనను దగ్గరకు తీసి, ఎంపీ పదవి ఇచ్చి, తానేదో మేధావి అనుకోని తాను ఏది చెప్పినా వెంటనే చేసేవారు కావడంతో సన్నిహితంగా ఉండేవారు.
అయితే, వైఎస్ జగన్ హయాంలో ఉండవల్లిపై అటువంటి అపోహాలు లేకపోవడంతో దగ్గరకు రానీయడం లేదు. ప్రభుత్వంలో జోక్యం చేసుకోనీయడం లేదు. దాంతో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ `సేహితుడి’ కొడుకు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏనాడూ వ్యవహరించలేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై ఇరిగేషన్ కాంట్రాక్టులలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా నోరు మెదపలేదు.
తాను కాంగ్రెస్ ఎంపీగా అందగానే, నాటి యుపిఎ ప్రభుత్వం వైఎస్ జగన్ పై అనేక అక్రమార్జన కేసులను నమోదు చేసినా జగన్ కు వ్యతిరేకంగా ఒక మాటకూడా మాట్లాడలేదు. మార్గదర్శి విషయంలో సహితం ప్రజాప్రయోజనాలకోసం కన్నా `రాజకీయ కక్షసాధింపు’ చర్యలలో భాగంగానే ఉండవల్లి వ్యవహరించినట్లు ఆయన ఇటీవల చేసిన వాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.
ఆనాడు రిజర్వు బ్యాంకు అడ్డుపడక పోతే, హైకోర్టు స్టే ఇవ్వకపోతే రామోజీరావు ఆస్తులు అన్నింటిని జప్తు చేసేవారని అంటూ చేసిన వాఖ్యలే అందుకు నిదర్శనం. పైగా, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ మాలవ్య వంటి వారి కేసులు, మార్గదర్శి కేసు ఒక్కటే అన్నట్లు ప్రచారం చేయడంలో ఆయన దురుద్దేశ్యం స్పష్టం అవుతుంది.
ఈ విషయంలో ప్రజలకు అవాస్తవాలు చేరవేసి, కక్షసాధింపు చర్యకు దిగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మార్గదర్శి – రిజర్వు బ్యాంకు ఒక అవగాహనకు వచ్చిన సమయంలో అంతర్జాతీయ సంస్థల నుండి ఎటువంటి అప్పులు పుట్టకుండా కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ద్వారా వైఎస్, ఉండవల్లి చేయగలిగారు.
దానితో, ఒక స్వదేశీ సంస్థ మార్గదర్శిలో పెట్టుబడులతో ముందుకు రావడంతో రామోజీరావు ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేయలేకపోయిన్నట్లు అర్థం వచ్చేటట్లు ఉండవల్లి వాఖ్యలు కనిపిస్తున్నాయి. వైఎస్, జగన్ ల అవినీతి సామ్రాజ్యాలకు గార్డ్ మాదిరిగా వ్యవహరిస్తున్న ఉండవల్లి తానేదో ప్రజోపకారం చేస్తున్నట్లు, అందుకోసమే జగన్ పై విమర్శలు చేయమనడం విస్మయం కలిగిస్తోంది.
యకులు ఉండటం గర్వకారణం అన్నారు. వీరా రెడ్డికి ముఠాలు లేవు.. ముఠానాయకులను ఓడించిన ఘనత ఆయనది అన్నారు. వీరా రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి కుటుంబాలు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కుటుంబాలని వ్యాఖ్యానించారు.