జగన్, కేసీఆర్ అవినీతి చిట్టాలను సిద్ధం చేస్తున్న బీజేపీ

Wednesday, January 22, 2025

వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ఉనికి చాటుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వాల `అవినీతి చిట్టా’లను సిద్ధం చేస్తున్నది.

ఒక వంక ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం  పట్ల దృష్టి సారిస్తున్న తమ రాజకీయ ఉనికి కోసం `ప్రభుత్వ వ్యతిరేకత’ను క్యాష్  చేసుకొనేందుకు ప్రభుత్వాల అవినీతిపై విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరిపిన భేటీలో ఈ అంశాలను వెల్లడించారు. 

ఈ భేటీలో ప్రదర్శించిన వీడియోలను ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా తయారు చేసినట్లు తెలుస్తున్నది. ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ కుంభకోణాల భాగోతాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్ పాలనపై బీజేపీ నివేదిక తయారు చేసింది. 

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎన్డీయే ఎంపీల సమావేశంలో వీడియోలను ప్రదర్శించారు. జగన్ పాలనలో జరుగుతున్న అవినీతిని ఎంపీలకు అర్ధమయ్యేలా బీజేపీ అధిష్టానం వీడియోల ద్వారా సవివరంగా ప్రదర్శించింది. 

ఏపీలో ల్యాండ్, శాండ్, మద్యం, విద్యుత్ కుంభకోణాలు, గంజాయి విక్రయాల గురించి వివరించింది. జగన్ పాలన మొత్తం అవినీతి మయంగా మారిందని వీడియోల ద్వారా వివరించింది. అటు తెలంగాణలో కేసీఆర్ పాలనలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయినట్లు బీజేపీ అధిష్టానం ఎంపీలకు వివరించింది. కాళేశ్వరం అవినీతితో పాటు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపైనా వీడియోల ప్రదర్శన చేశారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత జగన్, కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీలకు ప్రధాని మోదీ ఆదేశించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రదర్శించిన అవినీతి చిట్టాలను కేవలం ఎన్నికల సమయంలో ప్రచారం కోసమే ఉపయోగించుకుంటారా? తామే ఆరోపిస్తున్న అవినీతి చర్యలపై కేంద్ర ప్రభుత్వంగాని, కేంద్ర దర్యాప్తు సంస్థలు గాని దృష్టి సారించి, తగు చర్యలకు సిద్ధపడతారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles