జగన్‌తో ‘పాపం పసివాడు’ సినిమా.. పవన్ ఎద్దేవా

Thursday, December 19, 2024

నిజాంపట్నంలో నిన్న వైఎస్సార్ మత్సకారల భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రెండు సినిమాల మధ్య విరామంలో వచ్చి రాజకీయ సభలు పెట్టి వెళ్లిపోతాడని, ఆ సమయంలోనూ బాబుకే కాల్షీట్లు ఇస్తాడని, బాబు స్క్రిప్ట్ ప్రకారమే అన్ని పనులు చేస్తాడని నిన్న నిజాంపట్నంలో జగన్ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా “పాపం పసివాడు” సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ ఆ పాత సినిమా పోస్టర్ పెట్టారు.

 సిఎం జగన్ చాలా అమాయకుడని చిత్రంలో ఒక చిన్న మార్పు మాత్రమే అవసరమని ట్వీట్‌లో సూచించారు. సినిమా పోస్టర్‌లో పిల్లాడి చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా, అక్రమ సంపద కోసం మనీ లాండరింగ్‌ను సులభతరం చేసే బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచాలని ఎద్దేవా చేశారు.

“ప్రియమైన ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గయుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు ‘రాయలసీమ’ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను. దయచేసి…. ” అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అలాగే ఈ కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ వైసీపీ ఏపీలోని నదీ తీరాల నుండి దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!! అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ను ముగించారు. తద్వారా తమపై విమర్శలు చేస్తన్న జగన్ అమాయకుడేమీ కాదని పవన్ చెప్పుకొచ్చారు.

అంతకు ముందు చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని.. అందుకే దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారని, ఇదే దత్తపుత్రుడిని జనం ఎమ్మెల్యేగా కూడా పనికిరారని ఓడించారని అన్నారని అంటూ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వీల్లే. పెళ్లి చేసుకున్నది వీల్లే, విడాకులు ఇచ్చేది వాళ్లే.. మళ్లీ పెళ్లి చేసుకున్నది.. మళ్లీ విడాకులు ఇచ్చేది వీల్లే. చంద్రబాబు కలిసి వెల్దాం అన్నారు. దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నారు” అంటూ ఎద్దేవా చేశారు.

“చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అలాగే చేస్తానని దత్తపుత్రుడు చెబుతారు. పోటీ వద్దని చెబితే అలాగే చేస్తాడు. చంద్రబాబు గాజువాక రానంటారు, దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతాడు. చంద్రబాబు చెబితే బీజేపీతో దత్తపుత్రుడు తెగదెంపులు చేసుకుంటారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయటానికైనా వెనకాడరు’’ అంటూ జగన్ విరుచుకుపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles