చంద్రబాబుఫై కేసు నమోదు… ప్రాణహాని ఉందని ప్రధానికి ఫిర్యాదు!

Monday, December 23, 2024

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుఫై 143, 353, 149, 188 సెక్షన్లు కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడో రోజు శుక్రవారం పర్యటనలో  బలభద్రపురం వద్ద ఆయన వాహనం ముందుకు కదలకుండా పోలీసు బస్సును అడ్డం పెట్టారు పోలీసులు. దానితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చంద్రబాబును అడ్డుకున్నారన్న సమాచారంతో పరిసర గ్రామాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకనే అనపర్తి చేరుకున్నారు. ఇక అనపర్తిలో ఏర్పాటు చేసిన సభ వద్ద విద్యుత్ సరఫరాను ఆపివేసినా పెట్రోమాక్స్ లైట్ల వెలుగులోనే ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా నిప్పులు చెరిగారు.

ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితిలో అనపర్తి వచ్చానని చెబుతూ “ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు చెబుతున్నా… ఈ అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించాను” అని వెల్లడించారు. ఇక శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి బాధ్యులుగా పేర్కొంటూ చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు చంద్రబాబుతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రోడ్ల మధ్యలో బహిరంగ సభలు పెట్టకూడదన్నా.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌ షో నిర్వహించడంతో పాటు, తనను దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

“నేనేమైనా పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చానా? నేను ఇక్కడికి వచ్చే హక్కు లేదా? ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించా. నా పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చిన పత్రాలు ఇవిగో. పోలీసులు నా దగ్గర పనిచేసినవారే. జగ్గంపేటకు వెళితే పోలీసులు సహకరించారు, పెద్దాపురం వెళితే పోలీసులు సహకరించారు… కానీ అనపర్తి వద్దామనుకుంటే అడ్డుపడ్డారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ అని ఒకడున్నాడు… ఖబడ్దార్ గ్రావెల్ సూర్యనారాయణ! నాతో పెట్టుకుంటున్నావు… జాగ్రత్తగా ఉండు! తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయడంలేదు. నేను భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా” అని చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారని, కానీ, అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు.

అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించిపార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని స్పష్టం చేశారు.

కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పోలీసులు అరాచ‌క‌త్వం సృష్టిస్తున్నార‌ని  చంద్ర‌బాబు నాయుడు మండిపడ్డాయిరు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు కావాల‌నే టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి చేశార‌ని ఆరోపించారు. పోలీసుల తీరుతో తాను అన‌ప‌ర్తి మార్చ్ చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పోలీసుల‌తో దాడులు చేయిస్తున్నార‌ని ఆరోపించారు.

మరోవంక, చంద్రబాబు నాయుడుకు జగన్ పాలనలో ప్రాణహాని ఉందని నరసాపురం ఎంపీ రామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు తగు రక్షణకై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ వ్రాసారు. చంద్రబాబు పర్యటనలో పోలీసులు కల్పించిన అడ్డంకుల గురించి ఆ లేఖలో వివరించారు.

ఇలా ఉండగా, అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని ఆయన హెచ్చరించారు. జగన్ ను జైలుకు పంపడం వల్లే సీఎం అయ్యారని గుర్తు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles