కాకినాడ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్వయంగా పోలీసులే రోడ్ కు అడ్డుగా నిలబడి అడ్డంకులు సృష్టించడంతో ఆయన వాహనాలు దిగి, చీకటిలో ఐదారు కి మీ నడుచుకుంటూ వెళ్లవలసి రావడం పట్ల కేంద్ర హోమ్ శాఖ సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. దేశంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ గల కొద్దిమంది నాయకులలో చంద్రబాబు ఒకరు. ఆయన భద్రతను నేరుగా కేంద్ర హోమ్ శాఖ పర్యవేక్షిస్తుంది.
పోలీసులే విద్యుత్ సరఫరాను ఆపివేసి చంద్రబాబు చీకటిలో నడచివెళ్లేటట్లు చేయడం, చీకటిలోనే బహిరంగసభ జరిపే పరిష్టితులు కల్పించడం గురించి ఆయనకు భద్రత కల్పిస్తున్న ఎస్ పి జి అధికారులు ఢిల్లీలోని తమ కేంద్ర కార్యాలయంపై నివేదిక పంపారు. దానితో ఆ నివేదికను హోమ్ శాఖకు పంపారు. దానితో ఈ విషయమై ఖంగుతిన్న హోమ్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై రాష్ట్ర పొలిసు అధిపతిని నివేదిక కోరిన్నట్లు తెలుస్తున్నది.
మూడు నెలల క్రితమే చంద్రబాబుకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నుండి ఎస్పీజీ ఉన్నతాధికారులు వచ్చి ఆయన భద్రతను సమీక్షించారు. అదనపు భద్రతను సహితం కల్పించారు. ఇటువంటి పరిస్థితులలో దేశంలోనే అత్యధికంగా భద్రతగల కొద్దిమంది నాయకులలో ఒకరైన చంద్రబాబును చీకటిలో నడిచేటట్లు చేయడం తీవ్రమైన అంశంగా భావిస్తున్నారు.
ఈ విషయంలో ఆయనకు ఎటువంటి ఆపద కలిగినా ఎస్పీజీ బాద్యత వాహినవలసి వచ్చెడిది. 72 ఏళ్ళ నాయకుడిని చీకటిలో నడిచేటట్లు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవంక, ఈ విషయమై వైసీపీ వర్గాలలో సహితం తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సంఘటన వైసిపి నాయకత్వంలో చంద్రబాబుకు పెరుగుతున్న ప్రజాబలం పట్ల ఆందోళనను వెల్లడిచేసిన్నట్లు భావిస్తున్నారు.
ప్రజలలో అనూహ్యమైన సానుభూతిని కూడా పోలీసుల తీరుతెన్నులు కల్పించినట్లు స్వయంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చెప్పడం గమనార్హం. రాజకీయ ప్రత్యర్థులకు ఈ విధమైన భద్రతాపరమైన సమస్యలు సురించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వమే చేయడం పట్ల కేంద్రంలోని హోంశాఖ ఉన్నతాధికారులు సహితం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ శ్రీనగర్ కు వెడితే కేంద్ర ప్రభుత్వం స్వయంగా భారీ భద్రత కల్పించడం గమనార్హం. పైగా, ఆయన దాల్ లేక్ వద్దకు వెళ్లి జాతీయ పతాకం ఎగరవేసే అవకాశం కూడా కల్పించారు. కానీ, ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన `రాజకీయ కక్షసాధింపు’ చర్యల కారణంగా శాంతిభద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని కేంద్ర హోమ్ శాఖ భావిస్తున్నది.
నరసాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖవ్రాసూ చంద్రబాబుకు రాష్ట్ర పోలీసుల చర్యల కారణంగా ప్రాణహాని ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.