గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. సక్సెస్ డౌటే!

Tuesday, January 14, 2025

దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరంకు ఆహ్వానం వచ్చినా కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయత్నాల మీదనే నమ్మకం పెట్టుకున్నారు. విశాఖలో తమ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఎక్కువ పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశించారు. అందుకే దావోస్ కు డుమ్మా కొట్టారు. కానీ.. కాస్త లోతుగా గమనిస్తే.. విశాఖలో ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో నిర్వహించబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ కావడం డౌటే అనిపిస్తోంది. అందుకు కొన్ని సహేతుకమైన కారణాలున్నాయి. రాజకీయ పార్టీల మధ్య విబేదాలు, పారిశ్రామిక పురోగతి మీద కూడా ప్రభావం చూపిస్తున్న వాతావరణంలో ఇలాంటి అనుమానాలు పుడుతున్నాయి.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించామని, మొత్తం 200 స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నామని, పారిశ్రామిక కారిడార్లలో 50వేల ఎకరాల వరకు భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రకటించారు. ఈ మేరకు సమ్మిట్ లో కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా కుదురుతాయని అంటున్నారు. ముందే కుదిరిన ఒప్పందాలకు సమ్మిట్ రూపేణా మళ్లీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభుత్వం నుంచి పెద్ద స్థాయిలో భూములను తీసుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కొంత వెనుకాడే అవకాశం ఉంది.
ఎందుకంటే- రాష్ట్రంలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తుందో లేదా మరొక పార్టీ వస్తుందో తెలియదు. ప్రభుత్వం మారితే గనుక ఈ భూ కేటాయింపులను సమీక్షిస్తుంది. యూనిట్లు గ్రౌండ్ కాలేదని, నిబంధనలు పాటించలేదని రకరకాల కారణాలు చెప్పి కేటాయింపులు రద్దుచేసే ప్రమాదం ఉంటుంది. మార్చిలో సమ్మిట్ అంటే. అవగాహన ఒప్పందం కుదిరినా.. ప్రభుత్వం భూములు సేకరించి పారిశ్రామికవేత్తలకు అప్పగించేసరికి రెండు మూడు నెలలు పడుతుందని అనుకుంటే.. ఆ తర్వాత తమ పరిశ్రమలను గ్రౌండింగ్ చేయడానికి వారికి 9 నెలల సమయం కూడా ఉండదు. ఇలాంటి నేపథ్యంలో తర్వాత మరో పార్టీ వచ్చి అన్నీ రద్దు చేస్తే వారు భారీగా నష్టపోతారు. అందుకే. ఏపీలో తెలివిగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు.. ఓ ఏడాది ఆగి ఎన్నికల ఫలితాల తర్వాత చేయవచ్చునని నిరీక్షించే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles