గ్యాస్ ధ‌ర పెంపుపై బిఆర్ఎస్ పోరుబాట!

Monday, September 16, 2024

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలలోకి వెళ్లే అవకాశాలను వదులుకోకుండా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నేతలకు తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంచ‌డంతో నిరసనగళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. 

గ్యాస్ ధ‌ర పెంపును నిర‌సిస్తూ కేంద్రానికి వ్య‌తిరేకంగా శుక్ర‌వారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు ఇచ్చారు.. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాల‌ని కోరారు.

కాగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ  మహిళలకు గ్యాస్ ధర పెంచి గిప్ట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.  అదాని షేర్ల ధరలు పడిపోవడంతోనే గ్యాస్ ధరను మోదీ పెంచేశారంటూ ఆమె మండిపడ్డారు. తక్షణం పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.

వంటగ్యాస్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ సిద్దిపేటలో వినూత్న తరహాలో నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహిళలు ‘కట్టెల పొయ్యి పై చాయ్ పెట్టి నిరసన తెలిపారు. కేంద్రం నిత్యవసర వస్తువుల ధరలను రోజురోజుకీ పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా రూ.50 పెంపుతో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ 1160కి చేరింది.  రెండేళ్ల కాలంలో నాలుగు సార్లు గ్యాస్ ధరలు పెంచా గ్యాస్ ధ‌ర‌లు ఇలా పెంచుకుంటూ పోవ‌డం వ‌ల్ల వంట ఇంటిలో గృహిణులు ఇబ్బందులు ప‌డుతున్నారని బిఆర్ఎస్ మండిపడింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధర రెండింతలుకు పెరిగింది.

తాజాగా రూ. 50లు పెంచడంతో భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధర రూ. రూ. 2,000కు చేరుకుంటుందని మహిళ సంఘాలు పేర్కొంటున్నారు. గత ఐదారు ఏళ్లు సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ చేసేంది అది కూడా ఎత్తివేసి, కేవలం ఉజ్వల యోజన పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ పొందిన వారికే సబ్సిడీ ఇస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

రానున్న రోజుల్లో గ్యాస్‌ధర పరిస్దితి చూస్తూంటే పాత కాలం నాటి కట్టెల పొయ్యి వాడే దుస్దితి కనిపిస్తుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు బాగా పెరుగుతూ ఉండడంతో ముఖ్యంగా బిజెపికి ఓట్ బ్యాంకుగా ఉండే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. దానితో ఈ విషయమై పెద్ద ఎత్తున నిరసనలు జరిపేందుకు బిఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles