ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభ రోజే తుమ్మల, పొంగులేటి షాక్!

Tuesday, July 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ తొలి బహిరంగసభను ఖమ్మంలో ఈ నెల 18న జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్న రోజుననే ఇక్కడ కీలకమైన ఇద్దరు నేతలు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం అవుతున్నది. ఈ బహిరంగసభ గురించి 

ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సోమవారం సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామానాగేశ్వర్‌రావు తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి  హాజరైనా కొత్తగూడెం, పాలెరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, కందా ఉపేందర్ డుమ్మా కొట్టారు. వారితో పాటు ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహితం ముఖం చాటేశారు. 

పైగా, అదే రోజున 18న ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీ కానున్నారని వార్తలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత భద్రతను కుదించినప్పటి నుండి ఇక పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్నట్లు, బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. 

పొంగులేటిని పార్టీ నుండి పంపేందుకు కేసీఆర్ కూడా సిద్ధమయ్యారని ఈ విషయంలో ఆయన అనుసరించిన వైఖరి స్పష్టం చేస్తున్నది. అయితే పొంగులేటితో పాటు ఆయన మద్దతు దారులు ఎవ్వరు పార్టీని ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

18న ఖమ్మం కలెక్టరేట్‌‌ను ప్రారంభించి.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు. ఈ సభకు మహబూబాబాద్‌‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు, కార్యకర్తలను సమీకరించనున్నారు. అయితే, ఆ సమయానికి పార్టీలో ఉండెడిది ఎవ్వరు, పోయెడిది ఎవ్వరనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

గతకొంతకాలంగా పార్టీపై తుమ్మల,పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొంగులేటి గత కొన్నిరోజులుగా చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది. 

అటు తుమ్మల కూడా తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే  ప్రకటించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సిట్టి్ంగ్ లకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో తుమ్మల కూడా పార్టీ మారుతారన్న  ప్రచారం జోరందుకుంది. వారిద్దరూ బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. 

అయితే, తుమ్మలను తిరిగి తన మాతృ పార్టీ టిడిపిలో చేరమని సన్నిహితులే వత్తిడి చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తీసుకొనే నిర్ణయం ఉమ్మడి జిల్లా రాజకీయాలలో కీలకం కానున్నది. ఏది ఏమైనా తుమ్మల, పొంగులేటి ఒకేసారి పార్టీకి దూరమైతే ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు కోలుకొని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 

కొత్త సంవత్సరం ప్రారంభం రోజు నుంచి ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల్లో చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఇటీవల  అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. 

‘సీఎం కేసీఆర్ కు మీ ఎమ్మెల్యే చాలా సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు’ అంటూ రామన్నపేట బహిరంగ సభలో అతనికే తిరిగి సీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంపై తుమ్మల వర్గం భగ్గుమంటుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles