కోడి కత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందే!

Saturday, September 7, 2024

గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్య ప్రయత్నం జరిగినట్లుగా వైసిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన కోడి కత్తి కేసులో విచారణను గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి దాటవేస్తున్నారు.  అయితే బాధితుడిగా కోర్టుముందు హాజరై ఆరోజు ఏమి జరిగించే చెప్పాల్సిందే అని ఈ కేసు విచారిస్తున్న విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేసింది.

 ఏప్రిల్ 10 న విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బాధితుడు జగన్ కచ్చితంగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయనతో పాటుగా పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఆదేశించింది. మంగళవారం, ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్ ను న్యాయస్థానం విచారించింది.

ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పని చేసేశ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్ లోకి వెళ్లేందుకు అవకాశం కోసం చూశాడు. టీ, కాఫీలు ఇచ్చే ఉద్దేశంతో వెళ్లాడు.

కోడికత్తితో జగన్ మీద దాడి చేశాడు. చిన్న గాయంతో జగన్ వెంటనే విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకుని ఆసుపత్రిలో చేరారు. తొమ్మిది కుట్లేసినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది.

శ్రీను జగన్ అభిమాని అని జగన్ పై సానుభూతి వచ్చేందుకు ఇలా చేశారని అని కొంతమంది అన్నారు. దాాదపు నాలుగేళ్లుగా నిందితుడు రిమాండ్‌లోనే ఉన్నాడు. నిందితుడికి బెయిల్ ఇప్పించాలని అతడి కుటుంబం సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసింది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ.. అతడి కుటుంబ సభ్యులు చేసిన దరఖాస్తులను కోర్టు కొట్టి వేసింది.

గతంలో విచారణ సందర్భంగా ఈ కేసుపై ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రధానమైన కోడికత్తి ఇంతకాలం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. నేరానికి వాడిన కత్తి సంగతి ఏంటని అడిగింది. తమ ముందుకు తీసుకురావాలని ఆదేశించింది. అప్పట్లో ఈ కోడికత్తి వ్యవహారంపై వైసీపీ, టిడిపిల మధ్య మాటల దాడి జోరుగా సాగింది. ఒకరి మీద ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు.

ఇదంతా టీడీపీ నేతల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎన్నికలలో సానుభూతి పొందడం కోసం జగన్ వేసిన ఎత్తుగడ అంటూ టిడిపి నేతలు కొట్టివేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఈ కేసు విచారణ గురించి ఆసక్తి చూపకపోతూ ఉండడంతో బలం చేకూరుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles