కేసీఆర్ ధోరణిపై కేంద్రంకు గవర్నర్ తమిళసై ఫిర్యాదు!

Wednesday, January 22, 2025

రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకలు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న `ప్రచ్ఛన్నపోరు’ మరోసారి రచ్చ రచ్చగా మారింది. నేరుగా కేసీఆర్ ను ఉద్దేశించి గవర్నర్ విమర్శలు కుప్పించడంతో బిఆర్ఎస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవంక, హైకోర్టు ఆదేశించినా తగురీతిలో రిపబ్లిక్ ఉత్సవాలు జరపకుండా తనను అవమానం చేయడంతో గవర్నర్ మండిపడుతున్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆమె ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.  ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు ఇచ్చానని గవర్నర్ వెల్లడించాయిరు. రిపబ్లిక్ వేడుకలు జరపడం ఇష్టంలేని రాష్ట్ర సర్కారు వేడుకలు నిర్వహించకపోవడానికి చెప్పిన సాకు నవ్వు తెప్పించిందని అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

 రాజ్ భవన్ లో కార్యక్రమం పూర్తికాగానే పుదుచ్చేరి చేరిన ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.  ‘ రిపబ్లిక్ వేడుకలు జరపాలని రెండు నెలల క్రితం  తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశా.. దాన్నిపక్కన పెట్టి  రాజ్‌భవన్‌లో నిర్వహించాలని రెండు రోజుల క్రితమే  లేఖ ఇచ్చారు. ఆ లేఖలో కూడా సీఎం హాజరవుతారని పేర్కొనలేదు” అంటూ ఆమె ఆగరహం వ్యక్తం చేశారు.

“రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చా.5 లక్షల మందితో ఖమ్మంలో సభ నిర్వహిస్తే గుర్తుకు రాని కరోనా నిబంధనలు.. రిపబ్లిక్ వేడుకలకు గుర్తుకు వచ్చాయా?. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు’’ అని ఆమె ఓవిధమైన హెచ్చరిక ధోరణిలో పేర్కొన్నారు.

ప్రోటోకాల్‌పై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ కలెక్టర్, ఎస్పీ సహా అందరిపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందన్న గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అయితే, ఎవరో ఆదేశాలకు అధికారులను శిక్షించడం సరికాదని,తన వల్ల వారికి బ్లాక్ మార్క్ రావడం ఇష్టం లేదని, అందుకే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

మరోవంక, రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యాంగ హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు అలా మాట్లాడకూడటం సరికాదని స్పష్టం చేశారు. గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని వెల్లడించాయిరు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని  ఏంటని ఆయన ప్రశ్నించారు.

అయితే, రాజ్యాంగానికి, గవర్నర్కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్  తొందరగా వీఆర్ఎస్ తీసుకోని వెళ్లిపోతే రాష్ట్రం బాగుపడుతుందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి మహిళలంటే చిన్నచూపన్న విజయశాంతి  కేసీఆర్ పాలనలో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు.

రాజ్యాంగం, గవర్నర్ పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి గౌరవమే లేదని, గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగాన్ని అవమనించి సిఎం కెసిఆర్ కు భారతదేశంలో ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు.

మరోవంక, తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మండిప‌డ్డారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అని క‌విత గుర్తు చేశారు.

కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము అని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కెసిఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని క‌విత త‌న ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles