కేసీఆర్ తో పొత్తుపై రేవంత్ రెడ్డి తిరుగుబాటు!

Wednesday, December 25, 2024

వరుసగా ఈడీ కేసులలో తన కుటుంభం సభ్యులను ఇరికించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కు దగ్గర కావడానికి ఒక వంక ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, 2024లో బిజెపిని ఓడించడం కోసం బిజెపి వ్యతిరేక పార్టీలు అన్నింటిని కలుపుకు పోవాలనే నినాదంతో బిఆర్ఎస్ తో పొత్తుకు కోసం కాంగ్రెస్ లో బలమైన కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినప్పటి నుండి ఆయనకు కేసీఆర్ సంఘీభావం తెలపడంతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేబడుతున్న అన్ని ఆందోళనలో బిఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది. ఇటువంటి సమయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదంటూ ఘంటాపధంగా చెప్పడం కాంగ్రెస్ లోనే కలకలం రేపుతున్నది.

ఒక విధంగా అటువంటి పొత్తు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు పరోక్షంగా హెచ్చరిక చేసినట్లు కనిపిస్తున్నది.  తాను టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఆ విధంగా చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ అటువంటి నిర్ణయం తీసుకొంటే తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే కాకుండా, కాంగ్రెస్ కు కూడా చేయాల్సి వస్తుందనే హెచ్చరిక చేసినట్లు పలువురు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

పొత్తుల విషయమై ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారంటూ కీలక వాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే తరహాలో చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉందని సంకేతం ఇచ్చారు.

రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని అంటూ హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు కచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ఠాక్రే జోక్యంతో కోమటిరెడ్డి తాను చేసిన కామెంట్లపై యూటర్న్ తీసుకున్నారు.

అంతేకాక బీఆర్‌ఎస్‌తో పొత్తు వుండదని రాహుల్‌గాంధీ చాలా స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.  కేసీఆర్  దృత రాష్టుడి కౌగిలి‌కి కాంగ్రెస్ బలి కాదాల్చుకొలేదని అంటూ పంజాబ్‌లో తమ ప్రభుత్వం రాకుండా ఆప్‌కి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా తెలంగాణపై ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర లో మహా వికాస్ అంగాడి ప్రభుత్వం రాబోతుందని చెబుతూ దానిని అడ్డుకోవడం కోసమే కేసీఆర్ బీజేపీ ఎజెండాను అక్కడ అమలు చేస్తుండని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని రేవంత్ ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లు మంచి రావని జోస్యం చెప్పారు. తమ పార్టీకి 20 సీట్లు వస్తే, పక్కపార్టీ్ల్లోకి వెళ్తారు కాబట్టి ప్రజలు ఈ సారి 80 సీట్లు కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని రేవంత్ తేల్చి చెప్పారు.

ఇక, బిజెపి – బిఆర్ఎస్ ఒక్కటే అన్నట్లు రేవంత్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణలో కెసిఆర్ లక్ష కోట్ల అవినీతి చేశారని, ఒక్క కేసు కూడా బీఆర్ఎస్ మీద పెట్టలేదని గుర్తు చేశారు. ఢిల్లీలో మద్యం కుంభకోణం కేజ్రీవాల్‌పై పెట్టిన కేసు తప్ప కేసీఆర్‌పై పెట్టిన కేసు, కవిత అరెస్ట్ పెద్ద ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles