కేసీఆర్ `తెలంగాణ సెంటిమెంట్’ కోసం జగన్ `ఉమ్మడి ఆస్తులు’ అంశం!

Wednesday, January 22, 2025

ఒక వంక చెల్లులు వై ఎస్ షర్మిల తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వంపై వీధి పోరాటాలు చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను గద్దె దింపేవరకు నిద్రపోనని శపధం చేస్తున్నది. మరోవంక జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో రెండు దశాబ్దాలుగా రాజకీయంగా కలసి వచ్చిన `తెలంగాణ సెంటిమెంట్’ కనుమరుగు కాకుండా, ఊపిరి పోసేందుకు అన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తున్నది. 

మూడున్నరేళ్లుగా పట్టించుకోకుండా అకస్మాత్తుగా రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆస్తులను పంచలేదంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం కేసీఆర్ కు `సెంటిమెంట్’ రగిల్చే అవకాశం కల్పించడం కోసమే అని స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు ఒకసారి కూడా వీటి గురించి పట్టించుకోకుండా, ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం గమనార్హం. 

‘‘రాష్ట్ర విభజన అనంతరం ఆస్తులు పంచలేదు. తెలంగాణలో 1.42 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వెంటనే ఆస్తులు పంచేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కేసీఆర్ తో ఉన్నతాధికారులతో కలసి మూడు సార్లు గతంలో జగన్ భేటీ జరిపారు. ఆ సమయంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు లేవు. 

విభజన హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 29 సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాలలో సహితం ఈ అంశాన్ని చర్చకు తీసుకు రాలేదు. కనీసం వైసిపి ఎంపీలు ఎవ్వరు పార్లమెంట్ లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. 

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌ 9లోని 91 సంస్థలు, షెడ్యూల్‌ 10లోని 142 సంస్థలు, ఇవి కాకుండా మరో 12 సంస్థల ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. సంస్థలతోపాటు, పంపిణీ చేయాల్సిన ఆస్తుల విలువ నికరంగా 1,42,601 కోట్ల రూపాయలు. ఇందులో సింహభాగంగా అంటే 91 శాతం హైదరాబాద్‌ మహానగరంలోనే ఉన్నాయి.

 విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో కీలక పాత్రధారి కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం జగన్ చేయక పోవడం గమనార్హం. ఇటువంటి సమస్యలు రాజకీయ చొరవతోనే పరిష్కారం అవుతాయి. అధికారుల స్థాయిలో, న్యాయస్థానాల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

ఆ విషయం  తెలిసే, కేవలం కేసీఆర్ కు సెంటిమెంట్ అస్త్రం అందించడం కోసం జగన్ ఈ ఎత్తుగడ వేసిన్నట్లు వెల్లడి అవుతుంది. మొన్నటికి మొన్న, “పరిస్థితి వస్తే తిరిగి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడాలని మేము చెబుతాము” అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం సృష్టించాయి. వెంటనే టిఆర్ఎస్ నేతలు అందుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 

ఈ వాఖ్యలు ఏపీ ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపామని వెల్లడి కావడం, వాటి వల్లన తమకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నదని గ్రహించడంతో ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించడం కోసం `ఉమ్మడి ఆస్తుల’ చిట్టాను విప్పిన్నట్లు కనిపిస్తున్నది. 

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ఆస్తులను తీసుకెళ్లేందుకు ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో కేసు వేసిందంటూ బలమైన సెంటిమెంట్ ను రగిల్చేందుకు బిఎస్ఆర్ కు అవకాశం ఇవ్వడం కోసమే ఇప్పుడు జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం అవుతున్నది. 

ఏపీ ప్రయోజనాల గురించి జగన్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద గాని, కేసీఆర్ ప్రభుత్వంతో గాని గట్టి స్వరంతో మాట్లాడిన దాఖలాలు లేవు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను వమ్ము చేస్తూ వస్తున్నారు. ఆ దిశలో ఇప్పుడు మరో అడుగు వేసిన్నట్లయింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles