కేసీఆర్ కు బిజెపి సుపారీ! అందుకై ఖమ్మంలో కుమారస్వామి గైరాజర్!

Wednesday, January 22, 2025

తెలంగాణ సీఎం బిఆర్ఎస్ ఏర్పాటు ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కీలక సందర్భంగా ఆయన వెంటవుంటూ, అండగా ఉంటున్న కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామి ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో కనిపించక పోవడం ఆసక్తి కలిగిస్తుంది. కర్ణాటకలో పోటీ చేసే విషయంలో కేసీఆర్ కు వారితో పొసగటంలేదా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

బిఆర్ఎస్ ను జాతీయ రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించిన అనంతరం మొదటిసారిగా జరిగిన ఖమ్మం బహిరంగసభలో నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు పార్టీల నాయకులు పాల్గొన్నారు. బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నట్లు వేరే పార్టీ కార్యక్రమంలో ఉండి కుమారస్వామి రాలేకపోయారని అనుకున్నా, కనీసం తన పార్టీ ప్రతినిధులు ఎవరినైనా పంపించి ఉండాలి గదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ఇస్తూ, తాము కూడా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడం, అందుకు కుమారస్వామి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేల్చిన `బాంబు’ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

రేవంత్ రెడ్డి నేరుగా బిజెపి పేరు చెప్పకపోయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రె్‌సను ఓడించేందుకు కేసీఆర్‌కు సుపారీ తీసుకున్నారని, ఆ సుపారీ ఇచ్చిందెవరని ప్రశ్నించారు.  కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓడితే లాభం ఎవరికి? అని ప్రశ్నిస్తూ పరోక్షంగా బిజెపికు కేసీఆర్ పనిచేస్తున్నట్లు ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రె్‌సను ఓడించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరికి సీఎం కేసీఆర్‌ రూ.500 కోట్లు ఆఫర్‌ చేశారంటూ రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ వ్యాపారాలు ఉన్న ఆ నాయకుడిని ఫాం హౌస్‌కు పిలిపించి బేరసారాలకు పాల్పడ్డారని, ఒత్తిడి తెచ్చి లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంపై దాడి చేసిన తర్వాత కర్ణాటకలో 120 నుంచి 130 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలుసుకున్న కేసీఆర్‌ అందులో 20 నుంచి 30 సీట్లలో ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతతో కేసీఆర్‌ బేరసారాలు చేశారని తెలిపారు. ఇది తెలిసి కేసీఆర్‌ను అసహ్యించుకున్న కుమారస్వామి బీఆర్‌ఎస్‌ సభకు గైర్హాజరయ్యారని చెప్పారు.

పైగా, కేసీఆర్‌ ఏ నాయకుడిని పిలిచి మాట్లాడారో తన వద్ద ఆధారాలున్నాయని, తాను చెప్పినదాన్ని కేసీఆర్‌ ఖండిస్తే వాటిని బయటపెడతానని రేవంత్ సవాల్ చేశారు. కేసీఆర్‌కు నిజంగా ప్రధాని మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎందుకు పోటీ చేయలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. మోదీని రక్షించేందుకే బీజేపీతో కలిసి కాంగ్రె్‌సను కేసీఆర్‌ నిందిస్తున్నారని ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles