కేజ్రీవాల్, కవితలకు తీహార్ జైలు తప్పదా!

Wednesday, January 22, 2025

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి వరుసగా విడుదల చేస్తున్న లేఖలు తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలను లక్ష్యంగా చేసుకొని ఈ లేఖలు వస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే కేంద్రములోని మోదీ ప్రభుత్వం అండదండలు లేకుండా ఇటువంటి తీవ్రమైన ఆరోపణలతో జైలు నుండి లేఖలు విడుదల చేసే అవకాశం ఉండదు.

పరోక్షంగా కేజ్రీవాల్, కవితలకు ఈ లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు పంపుతుందా? తమతో `రాజకీయ బేరం’ కుదుర్చుకొనని పక్షంలో తీహార్ జైలుకు వెళ్ళాక తప్పదని వారిద్దరిని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తీహార్ క్లబ్ కు కవిత, కేజ్రీవాల్ కు స్వాగతమంటూ సుఖేష్ తాజా లేఖలో పాల్గొనడం గమనార్హం.

ఈ లేఖలో ముఖ్యంగా కవితను ఉద్దేశించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ముందు కేజ్రీవాల్ ఆ తరువాత నీ వంతే అంటూ కవితకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. `సుఖేష్ ఎవ్వరో నాకు తెలియదు. ఎప్పుడు కలవనే లేదు’ అంటూ రెండు రోజుల కిందట కవిత ఇచ్చిన ప్రకటనను తూర్పురాబడుతూ ఈ లేఖలో పేర్కొన్నాడు.

‘కవిత’ పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్ల స్క్రీన్ షాట్లను సుఖేష్ రిలీజ్ చేశాడు. అలాగే మరిన్ని వీడియో చెట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న సుఖేష్ త్వరలోనే విడుదల చేస్తానని చెప్పాడు.  ఇక తెలుగుభాషను సుఖేష్ ఎలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల ప్రశ్నకు సుఖేష్ కొట్టిపారేశాడు.

తెలుగు (తండ్రి), తమిళం (అమ్మ) రెండూ తనకు మాతృభాషలే అని, చిన్నప్పటి నుండి ఇంట్లో తల్లితండ్రులు మాట్లాడే బాషలని చెప్పుకొచ్చాడు.  ఇంకా అనేక భాషలు మాట్లాడగలనని చెబుతూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పేర్కొన్నాడు. అందుకే తాను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నట్లు లేఖలో తెలిపాడు.

పైగా, కవిత, కేజ్రీవాల్ తో మాట్లాడిన, చాట్ చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ బయటకు ఉన్న తన టీం దగ్గర భద్రంగా ఉన్నాయని, లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కోరిన వెంటనే తన టీమ్ ఆధారాలను సమర్పిస్తుందంటూ లేఖలో వెల్లడించాడు.  మరోవంక, ఎమ్మెల్సీ కవితను ఎల్లప్పుడూ తన అక్కగానే భావిస్తానంటూ వినయం ప్రదర్శించాడు సుఖేష్. 

`కవితక్క నేను ఎవరో తెలియదని చెప్పారు.. కానీ కవితక్క అలా చెబుతారని అనుకోలేదు. కవిత అంటే నాకు గౌరవం.. అందుకే నేను ఆమె పేరును కవితక్క అని సేవ్ చేసుకున్నా. కవితక్కకు చెందిన రెండు ఫోన్ నెంబర్లు 91‌- 6209999999, 91-8985699999 నా ఫోన్‌లో కవితక్క అని సేవ్ చేసుకున్నా అని సుకేష్ లేఖలో రాసుకొచ్చాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles