కాంగ్రెస్ వైపు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి!

Saturday, December 21, 2024

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన్నప్పటికీ పార్టీ నుండి వలసలు ఆగే అవకాశం కనిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్త్ర అధ్యక్షునిగా నియమించిన రోజుననే మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వెళ్లి రెండు రోజుల క్రితమే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలసి రావడం కలకలం సృష్టిస్తుంది.

ఇప్పటికే ఆయన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారని చెబుతున్నారు. గత ఏడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి బీజేపీలో చేరిన ఆయన ఉపఎన్నికలో ఓటమి చెందడంతో అసంతృప్తిగా ఉన్నారు. కొందరు బీజేపీ నాయకులే తన ఓటమి కోసం పనిచేశారని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పొంగులేటి ఆహ్వానించగా  ఇప్పుడే పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణ‌యం తీసుకోలేన‌ని వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చాలని కోరిన వారిలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.

 తాజాగా బండి సంజ‌య్ ని అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కిష‌న్ రెడ్డికి ఆ బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్టింది. అలాగే ఈట‌ల కూడా తెలంగాణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌గోపాల్ కాంగ్రెస్ లో చేరేందుకు త‌టాప‌స్తున్నారు. అయితే కిషన్ రెడ్డితో కూడా ఆయనకు అంత సఖ్యత లేదని తెలుస్తున్నది. 

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో తగు ప్రాధాన్యత లభించకపోవడంతో ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు సిద్దమైన ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగిపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా మారారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ లోకి రావచ్చని కొద్దీ రోజుల క్రితమే సంకేతం ఇచ్చారు.

ముఖ్యంగా కిషన్ రెడ్డి రాష్త్ర బిజెపి అధ్యక్షుడు కావడంతో ఆ పార్టీలో తమకు స్థానం లేదని రాజగోపాలరెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటె, ప్రజలతో సంబంధం గల ఏ నాయకుడిని, ముఖ్యంగా రెడ్డి సామజిక వర్గంకు చెందిన వారిని కిషన్ రెడ్డి ప్రోత్సహించారని, వారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తారని పేరుంది.

గతంలో బీజేపీలో చేరిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కిషన్ రెడ్డి వ్యవహారంతో అవమానంగా భావించి, పార్టీని వదిలి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఐదు సార్లు ఎమ్యెల్యేగా గెలిచి, పదేళ్లకు పైగా మంత్రిగా ఉన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా పార్టీ కార్యాలయంలో అవకాశం ఇచ్చేవారు కాదు.

2014 ఎన్నికలకు ముందు తెలంగాణాలో పార్టీ ఎన్నికల సారధ్యం అప్పచెప్పితే, పార్టీలో చేరి అధికారంలోకి వచ్చేందుకు సొంత వనరులతో కృషి చేస్తామని కోమటిరెడ్డి సోదరులు సిద్ధపడ్డారు. అయితే వారిని ఆ సమయంలో కిషన్ రెడ్డి నిరుత్సాహ పరచడంతో పార్టీలో చేరలేదని ప్రచారం జరిగింది.

బీజేపీలో ఉంటె వచ్చే ఎన్నికలలో తిరిగి ఎమ్యెల్యేగా గెలుపొందడం కష్టం అనే నిర్ణయానికి రాజగోపాలరెడ్డి వచ్చారని చెబుతున్నారు. పైగా ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నా వెంకటరెడ్డి కాంగ్రెస్ పెద్దలతో ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకొస్తానని మాట యిచ్చారని తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles