కాంగ్రెస్ లో చేరిన ఉద్యమనేత, కేసీఆర్ సన్నిహితుడు

Wednesday, January 22, 2025

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో అధికార పార్టీకి, అక్కడ బలం పెంచుకుంటున్న బిజెపికి కూడా వరుసగా షాక్ లు తగులుతున్నాయి. 2019లో ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాయం బాబురావు ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరికొద్ది మంది నేతలు బిఆర్ఎస్ లో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా మంత్రిపదవి పొందారు.

అధికార పక్షం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగితే తమ బలం పెరుగుతుందని ఎదురు చూస్తున్న బీజేపీ నేతలకు నిరాశ కలిగిస్తూ, పలువురు బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా,  బిఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, సి.ఎం కెసిఆర్ సన్నిహితుడుగా  పేరున్న ఉద్యమనేత కె. శ్రీహరి రావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం కలకలం సృష్టిస్తున్నది.

గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీహరి రావుతో పాటు సికింద్రాబాద్ కు చెందిన నోముల ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత  అనుచరులు, ముఖ్యకార్యకర్తలతో సమావేశమైన శ్రీహరిరావు అందరితో ఏకాభిప్రాయానికి వచ్చి బిఆర్ఎస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

కార్యకర్తల అభీష్టం మేరకు ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు పంపించారు. నిర్మల్ నియోజకవర్గం నుండి కె. శ్రీహరి రావు 2009, 2014లలో టిఆర్ఎస్ పార్టీ తరఫున నిర్మల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే గత రెండు నెలల నుండి పార్టీ అధినాయకత్వంపై నిరసన గళం విప్పుతున్నారు.

పార్టీలో నకిలీ ఉద్యమ నాయకులు ఉన్నత పదవులలో కొనసాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పనితీరుపై మండిపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ సమావేశాలకు, బహిరంగ సభకు కూడా దూరంగా ఉన్నారు.

ముఖ్యమంత్రికి కేసీఆర్, ఐటి మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడని పేరు ఉన్న శ్రీహరి రావు పార్టీకి రాజీనామా చేయడం స్థానికంగా కలకలం రేపుతుంది.
నెల రోజుల క్రితం నిర్మల్ జిల్లా సారంగాపూర్ జెడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. 

ఇదిలా ఉంటే గతంలో కాంగ్రేస్ పార్టీలో ఉన్న శ్రీహరి రావు ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. తిరిగి దశాబ్ద కాలం తర్వాత మళ్లీ స్వంత గూటికి చేరుతున్నారు.  బిఆర్ఎస్ పార్టీని మరికొంతమంది కూడా వీడి కాంగ్రెస్ కండువా కపుకోనున్నట్లు ప్రచారం సాగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles