కాంగ్రెస్ లో చిచ్చు రేపిన కేసీఆర్ పొత్తు సంకేతం!

Monday, December 23, 2024

ఏ పార్టీ సొంతంగా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అంటూ లౌకిక పార్టీలలోని కాంగ్రెస్, బిఆర్ఎస్ కలవాలని పరోక్షంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆయన చెబుతున్నట్లు యాదృశ్చికంగా ఓ సర్వే వివరాలు చెప్పడం కాదని, వ్యూహాత్మకంగా వేసిన అడుగు అని తెలుస్తున్నది.

సొంతంగా గెలుపొందడం పట్ల నమ్మకంగా లేని సీఎం కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్ లో కొందరిని దగ్గరకు తీసి, రెండు పార్టీల మధ్య పొత్తురాగం వినిపిస్తున్నారని చెబుతున్నారు.  బిఆర్ఎస్ తో పొత్తు పట్ల రాహుల్ గాంధీ విముఖంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు సుముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

టిపిసిసి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు ఈ విషయంలోనే అని వెల్లడవుతుంది. పైగా, ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టడం కోసం వచ్చిన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీకి ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు బైటపెట్టక పోవడం గమనార్హం.

గతంలో కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ తన నివేదికలో బిఆర్ఎస్ తో పొత్తు గురించి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను స్వయంగా కలిసి సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తున్నది. ముఖ్యంగా మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అటు కేసీఆర్ తో, ఇటు కాంగ్రెస్ లో దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఈ విషయమై సమాలోచనలు జరిపినట్లు వెల్లడైంది.

కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైతే సగం లోక్ సభ సీట్లను వదలడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సానుకూల సంకేతాలు కేసీఆర్ పంపడం ఈ సందర్భంగా గమనార్హం. మోదీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలను తూర్పురబడుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విధానాలను పొగడ్తలతో ముంచెత్తారు.

కాగా, తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతూఅందుకే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అందుకనే కోమటిరెడ్డి కాంగ్రెస్ సొంతంగా గెలుపొందదని ప్రకటించినా ఎటువంటి క్రమశిక్షణాచర్య తీసుకోకపోవడం అందుకనే అని ఆయన ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles