కాంగ్రెస్ నేతలకి గాలం వేస్తున్న కేసీఆర్

Wednesday, January 22, 2025

కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి జోష్ లో ఉన్న కాంగ్రెస్ బిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలపై దృష్టి సారిస్తూ ఒకోరోక్కరిని తమ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. ముందుగా పార్టీలో అసంతృతీపిగా ఉన్నవారెవ్వరు వదిలి వెళ్లిపోకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవంక, కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను భారీ ఆఫర్ లతో ఆకట్టుకొని కాంగ్రెస్ కు `రెవెర్స్ పంచ్’ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా ముగ్గురు నేతలపై మొదటగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేత కె జానారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డిలను ఆకర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండకపోవచ్చని దిగాలుగా ఉంటె, మిగిలిన ఇద్దరూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత పట్ల అసంతృప్తితో ఉన్నారు.

జానారెడ్డి కుమారుడికి నాగార్జున సాగర్ సీటు ఇచ్చేందుకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన భార్య పద్మావతిలలో ఒకరికి సీట్ ఇచ్చేందుకు, జగ్గారెడ్డికి సహితం సముచిత స్థానం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ద్వారా ఆఫర్లు పంపుతున్నట్లు చెబుతున్నారు.  అయితే కేసీఆర్ ఆఫర్లపై వారి స్పందన ఏమిటో తెలియడం లేదు.

కాగా, తాను పార్టీ మారుతున్నారనే వార్తలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌ ను వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ దుష్ప్రచారం చేసేవారిని న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారి ప్రాబల్యం పెరుగుతూ ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకింత అసహనంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆ మధ్య రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలో సీనియర్లు అందరిని సమావేశ పరచి, దాదాపు రేవంత్ రెడ్డి చేపట్టే కార్యకలాపాలను `బహిష్కరించే’ విధంగా చేశారు.

అయితే, అధిష్టానం జోక్యంగా అది కొనసాగలేదు. పైగా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పుడు పార్టీ అధిష్టానంకు తెలంగాణ తర్వాత టార్గెట్ గా మారి, అగ్రనాయకులు రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నారు. దానితో పార్టీ వ్యవహారాలలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో కొంత ఎడబాటుతో ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని బిఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

బిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకొంటుండటంతో వారికి కేటాయించే సీట్లలో ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అటువంటి వారిలో గెలుపొందే అవకాశం ఉన్నవారిని గుర్తించి అధికార పార్టీలో చేసే విధంగా  చేసుకోవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles