కవిత ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ఈడీ అధికారులు!

Wednesday, January 22, 2025

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇక అరెస్ట్ తప్పదని బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత నిర్ధారణకు వచ్చిన్నట్లున్నది. సోమవారం ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం అంతా నాటకీయంగా జరిగింది. ఆదివారం సాయంత్రం వరకు ఆమె హాజరు గురించిన సమాచారం లేదు. పొద్దుపోయిన తర్వాత కూడా తనను ఈడీ విచారించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో ఉండగానే, మొదటిసారికన్నా ఎక్కువగా రాత్రి 9.10 గంటల వరకు ఆమెను విచారించారు.

ఈ సందర్భంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించడంతో పాటు ఆమె కూడా వారిపై ప్రశ్నలవర్షం కురిపించడంతో వారు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిన్నట్లు తెలుస్తున్నది. ఆమెపై మెుత్తం 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ వ్యవహారాలు, రామచంద్రపిళ్లైతో ఉన్న ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే కవిత కూడా ఈడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకూ ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని ఎంఎల్‌సి కవిత సోమవారం ఇడి అధికారులకు మరోసారి స్పష్టం చేస్తూ వారడిగిన అనేక ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తున్నది.

తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారం లేకున్నా కేవలం రాజకీయ కుట్రతోనే వరుసగా విచారణల పేరిట వేధిస్తున్నారని ఆమె నేరుగా ఈడీ  అధికారులకు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఢిల్లీ పాలసీతో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్ర అని ఆమె అధికారులతో అన్నట్లు సమాచారం.

తనను ఈ కేసులో నిందితురాలిగా పిలిచారా? అని కూడా ఆమె ఈడీ అధికారులను అడిగినట్లు తెలిసింది. తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లు మీడియాకి లీకులు ఎవరిచ్చారని ఈడీని ఆమె నిలదీసినట్లు తెలుస్తున్నది. ఈనెల 11న స్వాధీనం చేసుకున్న తన ఫోన్‌ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చునని కవిత ఈడీ అధికారులకు సూచించారు.

కవిత పూర్తి విశ్వాసంతో, స్థైర్యంతో విచారణను ఎదుర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయట ప్రచారం జరిగినట్లుగా ఇతర నిందితులతో ఉమ్మడి కాకుండా కవిత ఒక్కరినే సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది.

ఇడి ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం చెప్పిన సమయానికే విచారణ కార్యాలయానికి వెళ్ళినా గంటసేపటి వరకు విచారణాధికారులు కార్యాలయానికి చేరుకోకపోవడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇది మానసిక హింసకాక మరేమిటని ఆమె అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

విచారణ సోమవారం సుదీర్ఘంగా 10 గంటలకు పైగా కొనసాగినా విచారణ జరిగిన తీరు పూర్తిగా రాజకీయ ఒత్తిడిలో భాగంగానే జరిగినట్లుగా కవిత సన్నిహితులు చెబుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె ఇడి అధికారులతో విచారణ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలిసింది.

విచారణ సందర్భంగా తాను చెప్పే ప్రతి అంశాన్నీ ఆడియో, వీడియో రికార్డు చేయాలని కవిత పట్టుబట్టి రికార్డు చేయించినట్లు తెలియవచ్చింది. మొత్తం విచారణలో 14 దాకా ప్రశ్నలను ఇడి అధికారులు సంధించినా లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపలేకపోయారని కవిత విచారణ అనంతరం తన సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు.

కాగా, ఢిల్లీ  కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్‌పిళ్లైతో కవితను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించాలని అధికారులు భావించినా,  అందుకు పిళ్లై అంగీకరించ కపోవడంతో, పిళ్లైను  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు.  ఈడీ కస్టడీ ముగియడంతో జైలుకు పంపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles