కవిత తర్వాత డ్రగ్స్ కేసులో కేటీఆర్ పై ఈడీ వల!

Saturday, January 18, 2025

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో చిక్కుకున్న బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ తో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కీలక నేతలకు సన్నిహితులుగా వెల్లడైన ఈ కేసులోని ముగ్గురు నిందితులను కాపాడటం కోసం ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ నోటీసులు పంపేందుకు రంగం సిద్ధమైంది. 

తాజాగా, ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో కీలకమైన నలుగురు ఎమ్యెల్యేలతో పాటు ముఖ్యమంత్రి కుమారుడు, ఐటి మంత్రి కేటీఆర్ పై కూడా  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ)   వల విసురుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాడుదారుడైన తాండూరు ఎమ్యెల్యే తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌రెడ్డి ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టింది. రెండు రోజులపాటు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 

 ఫామ్‌‌హౌస్ కేసు తర్వాత రోహిత్‌‌రెడ్డి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌‌లో జరిపిన భేటీ వివరాలనూ ఈడీ సేకరిస్తున్నది. రోహిత్‌‌రెడ్డిని ఈ నెల 19, 20వ తేదీల్లో ఈడీ విచారించింది. ఫామ్‌‌హౌస్ కేసులో ఆఫర్‌‌‌‌ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలతో పాటు 2015 నుంచి రోహిత్‌‌రెడ్డి నిర్వహిస్తున్న బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్స్, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించింది. 27న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.

ఇక,  బెంగళూరు డ్రగ్స్ కేసు  అదే విధంగా కేటీఆర్ చుట్టూ తిరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  బిఆర్ఎస్ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను ముందుగానే హెచ్చరిస్తూ వస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కేసు విషయంలో సహితం చేసిన హెచ్చరిక కలకలం రేపుతోంది. 

సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్నారన్న  సంజయ్.. త్వరలోనే ఆయన కుమారుడు కూడా మరో స్కాంలో దొరికిపోతున్నారని జోస్యం చెప్పడం గమనార్హం. కేటీఆర్‌కు బెంగుళూరు డ్రగ్స్‌ కేసుకు సంబంధముందని ముందు నుంచి ఆరోపిస్తున్న బండి సంజయ్ నార్కోటిక్ టెస్ట్‌ చేయించుకోవాలని గతంలో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ సవాల్ మళ్లీ తెర మీదికి రావటంతో దీనిపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. తన వెంట్రుకలు, రక్తంతో పాటు అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని, ఏమీ తేలకపోతే సంజయ్ చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

దానికి అంతే తీవ్రంగా స్పందించిన సంజయ్ టీఆర్ విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చి, ఇప్పుడు వెంట్రుకలిస్తానంటున్నాడని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మొత్తం కేటీఆర్ దోస్తులే ఉన్నారని స్పష్టం చేస్తూ హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్స్ కేసుల్లో ముమ్మర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో కేటీఆర్‌‌కు సంబంధముందని ముందు నుంచి చెబుతున్న సంజయ్ త్వరలోనే దొరికిపోతున్నారని అంటూ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్ళిమళ్ళి చెప్పడంతో దుమారం చెలరేగుతోంది. రోహిత్ రెడ్డి విషయంలోనూ ఇలాగే సంజయ్ చెప్పిన రెండు రోజుల్లోనే అధికారులు నోటీసులు పంపడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles