కవిత అరెస్ట్ పై బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్!

Wednesday, January 22, 2025

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను శనివారం ఈడీ విచారణ అనంతరం అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వాస్తవానికి పది రోజులముందు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డలు రాష్ట్ర నేతలతో ఢిల్లీలో జరిగిన భేటీలోనే ఆమెను అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఆమెను అరెస్ట్ చేస్తే కేసీఆర్ అవినీతిపరుడు అనే సందేశం జనంలోకి వెడుతుందని, దానితో వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తుందని జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డి అరవింద్, ఇతర నేతలు స్పష్టం చేశారని చెబుతున్నారు. అరెస్ట్ జరుగుతోందని, దానని రాజకీయంగా బాగా వాడుకోవాలని అమిత్ షా వారికి మార్గనిర్ధేశం చేసిన్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే, ఆమె అరెస్ట్ అవుతున్నట్లు కిషన్ రెడ్డి, సంజయ్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం, అరెస్ట్ చేస్తే తప్పేమిటి అన్నట్టు ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి తారుమారైనట్లు కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ అప్రమత్తమై రాజకీయంగా ఎదురు దాడి ప్రారంభించడం, ఈడీ, సిబిఐ లను రాజకీయ ప్రయోజనాలకోసం మోదీ ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగించుకొంటుందో జాతీయస్థాయి ప్రచారంకు సిద్ధంకావడంతో బిజెపి ఆత్మరక్షణలో పడినట్లు పలువురు భావిస్తున్నారు.

కవితకు ఈడీ నోటీసులు జారీచేసిన్నప్పటి నుండి, ఆమె విచారణకు హాజరయ్యేవరకు తెలంగాణాలో జరిగిన పరిణామాలు బిజెపిని దోషిగా అనిలబెట్టేందుకే దోహదపడుతున్నట్లు, సానుభూతి పొందేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో కవిత అరెస్ట్ ప్రస్తుతంకు ఆగినట్లు తెలుస్తున్నది.

దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ను నిలువరించేందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, అరెస్ట్ ద్వారా బిజెపి రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం చేకూర్చుకొనే పరిస్థితులలో లేదని, బిఆర్ఎస్ మాత్రం రాజకీయంగా బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోందని  ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఉదంతంతో కేంద్ర నాయకుల వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఇప్పటివరకు ఉన్న నమ్మకం సడలిన్నట్లు కూడా స్పష్టం అవుతుంది. వారిద్దరికీ క్షేత్రస్థాయి రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదని అమిత్ షా నిర్ధారణకు వచ్చిన్నట్లు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలకు, వారు పార్టీ నాయకత్వం ముందుంచిన అంశాలకు మధ్య ఎటువంటి పోలిక లేకపోవడంతో వారిద్దరూ షో మాస్టార్లే అని కూడా వెల్లడయింది.

ఈ విషయమై ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచనప్రాయంగా వారిద్దరి గురించి అమిత్ షాకు నివేదించినట్లు తెలిసింది. అందుకనే అమిత్ షా చివరి క్షణంలో వ్యూహాన్ని మార్చి కవితను విచారించి వదిలేశారు. మధ్యాహ్నం ఆమె వ్యక్తిగత ఫోన్ కావాలని అడిగి, ఇంటినుండి తెప్పించేటలంటూ స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

సాయంత్రం 5.30 గంటల వరకే మహిళలను విచారించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ 8 గంటల వరకు విచారణ సాగడం కూడా అరెస్ట్ చేసేందుకే అని భావిస్తున్నారు. అరెస్ట్ తర్వాత ఎటువంటి అలజడులు ఉండకుండా చూసేందుకు పోలీస్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పుడు 16న కవితను అరెస్ట్ చేస్తారా? మరికొంత కాలం ఎదురు చూస్తారా? చూడవలసి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles