కవితకు హఠాత్తుగా ఇంత ప్రేమ పొంగింది ఎలా?

Sunday, November 17, 2024

 చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును.. ఈ నెలలో ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాలలోనే ఆమోదించి చట్టం చేయాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్  చేస్తున్నారు. ఆ డిమాండ్తో మహిళా దినోత్సవాన్ని కూడా ముడిపెట్టి,  ఈనెల 10వ తేదీన ఢిల్లీలో పెద్ద స్థాయిలో దీక్ష చేయడానికి ఆమె పూనుకుంటున్నారు.  నిజానికి ఆమె మహిళా దినోత్సవం అయిన ఎనిమిదవ తేదీన దీక్ష చేయాలనుకున్నారట,  కానీ ఆ రోజు హోలీ కనుక కాస్త ఒక మెట్టు దిగి పదవ తేదీన రిలే నిరాహార దీక్షకు ముహూర్తం పెట్టారు.

భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును చట్టం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి రెండు దఫాలుగా విఫలం అయినదట.  2014లోనూ,  2019లో కూడా ఈ మాట చెప్పే అధికారంలోకి వచ్చి తర్వాత పట్టించుకోలేదుట.  కాబట్టి తక్షణం ఆ చట్టం తేవాలని కవిత డిమాండ్.  ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష అనేది.. అందుకోసం  ఆమె ఎంచుకున్న కార్యాచరణ ప్రణాళిక.  ఎంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది..  బిజెపి ఈ విషయంలో 9 ఏళ్లుగా విఫలమవుతూనే ఉన్న సంగతి..  ఆమెకు తెలుసు కదా! మరి ఇన్నాళ్ళలో ఎప్పుడు ఆ డిమాండ్ ని వినిపించలేదు ఎందుకు.. ? ఇలాంటి సందేహాలు అందరికీ కలుగుతాయి. 

 కాస్త లోతుగా ఆలోచిస్తే,  మహిళా బిల్లు కోసం కేవలం మహిళలు మాత్రమే పోరాడాలా?  దీక్ష చేయాలా?  అనేది ఇంకో సందేహం.  కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే..  తమ పార్టీ ఎంపీలతో పార్లమెంటులో ఈ బిల్లు కోసం గట్టిగా డిమాండ్ వినిపించవచ్చు.  తాను ఒక్కటే కాదు కదా,  తన పార్టీ ఎంపీలు అందరితోనూ పెద్ద స్థాయిలోనే నిరాహార దీక్ష చేయించవచ్చు.  పార్లమెంటులో తేలవలసిన సంగతి కాబట్టి,  ఎంపీలని పురమాయించవచ్చు. కానీ కవిత ఆ పని చేయడం లేదు.  తనే దీక్షకు దిగుతున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో..  తదుపరి కవిత అరెస్టు కూడా త్వరితంగా ఉంటుందని వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో.. కల్వకుంట్ల కవిత దీక్ష చేయడం విశేషం.  ఈ దీక్ష ద్వారా,  భారతీయ జనతా పార్టీ తన మీద కక్ష కడుతున్నది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.  తాను మహిళల కోసం పోరాడుతున్నది కాబట్టి,  తన మీద బిజెపి కక్ష కట్టిందని ప్రచారం చేస్తుంది. ఇదంతా పెద్ద మాయోపాయం లాగా కనిపిస్తుంది. 

తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకుండా, మహిళా లోకాన్ని అవమానపరచిన తండ్రి దగ్గర కవిత మహిళా సమాజం గురించి తమ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదోనని ఎప్పటికి తెలుసుకుంటుందో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles