కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు… అరెస్ట్ పై రక్షణకు నిరాకరణ

Sunday, July 7, 2024

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనను అనుమానితురాలిగా పేర్కొంటూ ఈడీ జరుపుతున్న విచారణ తీరుతెన్నులపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈడీ అరెస్ట్ నుండి రక్షణ పొందాలని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈడీ తనను అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లపైనా కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. పైగా, విచారణను మూడు వారాలపాటు వాయిదా వేయడంతో ఇప్పుడిపుడే ఈడీ విచారణ నుండి కవితకు ఎటువంటి రక్షణ లభించకపోవచ్చని స్పష్టమైంది.

అయితే ఆమె ప్రధానంగా ప్రస్తావించిన పీఎంఎల్ఎ కింద మహిళలను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించడంపై విచారణకు సుప్రీం అంగీకరించింది. ఇదే తరహా వినతితో ఉన్న నళిని చిదంబరం పిటిషన్ తో కవిత పిటిషన్ ను జత చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి 11న తొలిసారి విచారించింది.

ఆ తర్వాత 16న మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే  చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నా ఈడీ కార్యాలయానికి తనను పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనాన్ని కోరారు. సీజేఐ మాత్రం అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. దీంతో మార్చి 27వ తేదీన జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను ఈడీతో కాకుండా కోర్టు పర్యవేక్షణలోని సిట్ ఏర్పాటు చేసి, విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత కవిత తన పిటిషన్‌లో సరికొత్త అభ్యర్థన చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని  పిటిషన్ వేశారు. 

కవిత పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు.

తన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయడంతో పాటు.. ఫోన్‌ను సీజ్‌ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌ను నళినీ చిదంబరం వర్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసుకు జత చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles