కర్ణాటక ఫలితాలతో దిక్కుతోచని తెలంగాణ బీజేపీ!

Saturday, January 18, 2025

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడం సాధించడంతో ఆ ఊపులో మరో ఐదారు నెలల్లో జరిగే తెలంగాణ ఎన్నికలలో కూడా విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భరోసా ఆ పార్టీ నేతలలో వెల్లడి అవుతుంది. కర్ణాటకలో మాదిరిగా వ్యూహాత్మకంగా, ఉమ్మడిగా పోరాటం చేయగలిగితే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం తేలిక కాగలదని ఉత్సాహం కనిపిస్తున్నది.

దానితో, కర్ణాటక తర్వాత దక్షిణాదిన పాగా వేసేందుకు తెలంగాణపై ఎంతో ఆశగా చూస్తున్న బిజెపి నేతలకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు.  కర్ణాటక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్ తెలంగాణలో తమకు అనుకూలంగా మారుతున్న రాజకీయ వాతావరణం మరింత కలిసొస్తుందని లెక్కలు వేసుకున్న బిజెపి నేతలకు ఆశాభంగం ఎదురైంది.

కర్ణాటకలో ఓటమి చెందినా కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రాకపోవచ్చని, ఏదోవిధంగా జేడీఎస్ తో చేతులు కలిపి తామే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు `ప్లాన్ బి’ సిద్ధంగా ఉందంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే సుమారు రెండు దశాబ్దాల కాలంలో ఇన్ని తక్కువ సీట్లు రాకపోవడం వారిని కలచివేస్తుంది.

పార్టీకి ఎంతో బలమున్న కర్ణాటకలోని మట్టికరవలసి రావడంతో, కనీసం బలమైన అభ్యర్థులు కూడా మూడింట రెండు వంతుల నియోజకవర్గాలలో లేని తెలంగాణాలో తమ పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నాయకులు సందిగ్దతో చిక్కుకున్నారు.  తెలంగాణాలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకాగానే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో అసంతృత్తిగా ఉన్న పలువురు నేతలు క్యూ కట్టి బీజేపీలో చేరతారని వేసుకున్న అంచనాలు తలకిందులైన్నట్లు గ్రహిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఆ దిశగా ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. బీజేపీ పరిస్థితి ఏంటనే దానిపై కొత్త సందేహాలు నెలకొన్నాయి.

తెలంగాణలో బలపడేందుకు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బాగానే ఆశలు పెట్టుకుంది. కర్ణాటకలో తమకు అనుకూల ఫలితాలు వస్త తెలంగాణలో తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని, అప్పుడు బీఆర్ఎస్ ను ఎదుర్కొనే స్థాయికి బీజేపీ చేరుకుంటుందని లెక్కలు వేసుకున్నారు.

కానీ ఇప్పుడు అక్కడ ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఏ విధంగా బలపడుతుందనే దానిపై సందేహాలు కమ్ముకున్నాయి. కర్ణాటక తరువాత తెలంగాణపైనే పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తామని ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా పలుసార్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో ఉంది.

దీంతో బీజేపీ హైకమాండ్ కాంగ్రెస్ ను మించి తెలంగాణలో ఏ విధంగా బలపడుతుంది ? ఇందుకు ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతుంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.  కర్ణాటక పోలింగ్ కు రెండు రోజుల ముందు బిజెపి తెలంగాణ నేతలు ఈటెల రాజేందర్ సారధ్యంలో ఖమ్మం వెళ్లి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో సమావేశమై బీజేపీలో చేరమని ఆహ్వానించడం తెలిసిందే.

ఈ సందర్భంగా నాలుగు రోజులు ఆలోచించుకొని చెబుతామనడం ద్వారా కర్ణాటక ఫలితాలను బట్టి తమ నిర్ణయం ఉంటుందనే సంకేతం ఇచ్చారు. ఆ విధంగా తెలంగాణాలో చాలామంది నేతలు బిజెపి, కాంగ్రెస్ లలో ఏపార్టీలో చేరాలనే సందేహంలో ఉన్నారు. వారందరికీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే కనిపించే అవకాశం ఉంది.

అయితే, కాంగ్రెస్ లో ఇప్పటికే చాలామంది నేతలు ఉండడంతో అక్కడ స్థానం దక్కనివారు మాత్రమే బీజేపీలో చేరే అవకాశం ఉంది. అటువంటి వారితో బీజేపీ ఎన్నికలలో చెప్పుకోదగిన ప్రభావం చూపే అవకాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి సారిస్తామని అమిత్ షా వంటి నేతలు చెబుతున్నా వారికి తెలంగాణ కన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ ఎన్నికలు ముఖ్యమని అందరికి తెలిసిందే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles